యాప్నగరం

118 మందితో వెళుతున్న విమానం హైజాక్

లిబియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి దారి మళ్లించారు.

TNN 23 Dec 2016, 5:24 pm
లిబియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి దారి మళ్లించారు. విమానాన్ని లిబియాకు ఉత్తరం వైపుగా 500 కి.మీ దూరంలో ఉన్న మాల్టా అనే దీవిలో ల్యాండ్ చేశారు. మాల్టా ప్రభుత్వం కూడా విమానం ల్యాండ్ అయిన విషయాన్ని, ఉగ్రవాదులు హైజాక్ చేయడాన్ని ధ్రువీకరించింది. తమ కమాండోలను విమానం ఉన్న చోటికి పంపించింది. మాల్టా ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ పై విషయాన్ని ట్వీట్ చేశారు. విమానం లిబియాలోని సెబా నుంచి ట్రిపోలికి వెళుతుండగా ఘటన జరిగింది. హైజాకర్లు విమానాన్ని గాలిలోనే పేల్చేస్తామంటూ బెదిరించారు.
Samayam Telugu libyan plane with 118 on board hijacked
118 మందితో వెళుతున్న విమానం హైజాక్


హైజాక్ కు గురైన విమానం వద్ద మాల్టా పోలీసులు

విమానంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది. సిబ్బంది, ప్రయాణికులతో కలిపి మొత్తం 118 మంది విమానంలో ఉన్నారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే హైజాక్ చేసినట్టు ప్రకటించలేదు. ఐసిస్ తీవ్ర వాదుల మీదే అందరి అనుమానం ఉంది. హైజాక్ కు గురైన విమానం ఆఫ్రీక్వియా ఎయిర్ లైన్స్ కి చెందిన ఎయిర్ బస్ ఏ320గా గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.