యాప్నగరం

కత్తితో స్టేషన్‌లోకి వచ్చిన దుండగుడ్ని...

చేతిలో ఆయుధంతో ఉన్న వారిని చూస్తే పోలీసులు దాన్ని పడేసి లొంగిపొమ్మని అంటారు. లేకపోతే అతడి ప్రాణాలకు హాని కలగకుండా కాళ్లపై కాల్చి నిరాయుధుడ్ని చేస్తారు.

TNN 29 Jun 2017, 5:18 pm
చేతిలో ఆయుధంతో ఉన్న వారిని చూస్తే పోలీసులు దాన్ని పడేసి లొంగిపొమ్మని అంటారు. లేకపోతే అతడి ప్రాణాలకు హాని కలగకుండా కాళ్లపై కాల్చి నిరాయుధుడ్ని చేస్తారు. అంతకీ వినకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్ష కోసం కాల్చి పారేస్తారు. కానీ దీనికి భిన్నంగా వ్యవహరించి అతడిని ప్రేమగా హత్తుకుని అందరి మన్ననలు పొందుతున్నాడు ఓ పోలీస్. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. బ్యాంకాక్‌లోని హ్యూయకాంగ్ పోలీస్ స్టేషన్‌లో అనిరుత్‌ మాలీ అనే పోలీసు అధికారి క‌త్తితో లోనికి ప్రవేశించిన వ్య‌క్తిని ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. ఈ దృశ్యం అంతా అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డయింది. కత్తి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి పలువురిని బెదిరించిన ఆ దుండ‌గుడిని పోలీసులు కాల్చేయాల‌నుకున్నారు. అయితే అనిరుత్ అలా చేయవద్దని త‌న సహచరులను వారించి, ఆ దుండ‌గుడికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.
Samayam Telugu man enters police station armed with knife now watch what officer does
కత్తితో స్టేషన్‌లోకి వచ్చిన దుండగుడ్ని...



కత్తి పట్టుకున్న వ్యక్తిని పక్కన పడేసి తన దగ్గరకు రావాలని అనిరుత్ కోరాడు. దీంతో నిందితుడు త‌న దగ్గర ఉన్న‌ కత్తిని అతడికి ఇవ్వ‌డానికి ప్రయత్నించాడు. దుండగుడి వ‌ద్ద‌కు వెళ్లిన ఆ అధికారి అత‌డిని హ‌త్తుకున్నాడు. త‌నపై పోలీస్ అధికారి చూపించిన ఔదార్యానికి ఆ దుండ‌గుడు క‌న్నీరు పెట్టుకున్నాడు. గతంలో సంగీతకారుడైన ఆ దుండ‌గుడి గిటార్‌ను ఎవరో కాజేయ‌డంతో చేసేది ఏమీ లేక మూడు రోజులుగా సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తున్నాడు. అయితే, సెక్యూరిటీ గార్డ్‌గా నియమించుకున్న య‌జమాని త‌న‌కు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో తీవ్ర‌ నిరాశకు గురై కత్తిపట్టుకొని ఇలా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అతడి కథ విన్న పోలీస్ ఆఫీసర్ గిటార్ కొని ఇవ్వడమే కాదు, కలిసి భోజనం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.