యాప్నగరం

64ఏళ్ల వయసులోనూ మూడోసారి పెళ్లికి రెడీ!

64ఏళ్ల వయసులోనూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీటీపీ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి రెడీ అవుతున్నట్లు సంకేతాలిచ్చారు.

Samayam Telugu 20 Nov 2016, 3:50 pm
64ఏళ్ల వయసులోనూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీటీపీ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి రెడీ అవుతున్నట్లు సంకేతాలిచ్చారు.
Samayam Telugu may be third time lucky says imran khan on hinted third marriage
64ఏళ్ల వయసులోనూ మూడోసారి పెళ్లికి రెడీ!


1995లో జెమిమా గోల్డ్ స్మిత్, 2015లో రెహమ్ ఖాన్ ను పెళ్లాడిన ఆయన ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

లండన్‌లో జరిగిన తన స్నేహితుడి కూతురు పెళ్లికి హాజరైన ఆయన..కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా తనకు మూడోపెళ్లి గురించి జోక్ చేశారు. గత రెండు పెళ్లిళ్ల బంధం సక్రమంగా కొనసాగలేదని, కానీ ‘ఈ సారి మూడోది బాగుంటుంది (లక్కీ)’ అంటూ తన మనసులోని మాటను వెలబుచ్చారు.

అయితే ఇమ్రాన్ ఎవరినీ, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారన్నది వెల్లడించలేదు. మూడో పెళ్లి మాత్రం గత పెళ్లిళ్ల కంటే మరింత ఒపెన్ గా ఉంటాయని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.