యాప్నగరం

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్ మృతి

టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిల్‌గేట్స్ చిన్ననాటి స్నేహితుడైన పౌల్ అలెన్ కేన్సర్ కారణంగా సోమవారం కన్నుమూశారు.

Samayam Telugu 16 Oct 2018, 9:02 am
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిల్‌గేట్స్ బాల్యమిత్రుడు పౌల్ అలెన్ (65) సోమవారం కన్నుమూశారు. లింఫోమా కేన్సర్‌తో అలెన్ తుదిశ్వాస విడిచారని ఆయన కంపెనీ వుల్కన్ తెలిపింది. నాన్-హడ్జ్‌కిన్ లింఫోమాకి చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటించిన రెండు వారాలకే అలెన్ మరణించారు. 9 ఏళ్ల క్రితం లింఫోమా కేన్సర్ బారి నుంచి ఆయన కోలుకున్నారు. కానీ వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రాణాలు విడిచారు.
Samayam Telugu Paul Allen


బాల్యమిత్రుణ్ని కోల్పోవడం పట్ల బిల్ గేట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడంతో హృదయం ముక్కలైందన్నారు. పౌల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ లేదని గేట్స్ తెలిపారు. కంపెనీ, ఐటీ ఇండస్ట్రీకి అలెన్ చేసిన సేవలను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కొనియాడారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని సత్య తెలిపారు.
1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌ కలిసి మైక్రోస్టాఫ్ సంస్థను స్థాపించారు. ఈ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. 1983లో ఆయన పోర్ట్‌ల్యాండ్ ట్రయల్ బ్లేజర్స్ అనే బాస్కెట్ బాల్ టీంను ఆయన కొనుగోలు చేశారు. సియాటిల్ సౌండర్స్ ఎఫ్‌సీ అనే సాకర్ టీం, సియాటిల్ సీహాక్స్ జట్లలో ఆయనకు వాటా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన 44వ స్థానంలో ఉన్నారు.

1986లో సోదరి జోడీ అలెన్‌తో కలిసి వుల్కన్ సంస్థను స్థాపించారు. పర్యావరణ, సమాజ హిత కార్యక్రమాల కోసం 2 బిలియన్ డాలర్లను ఆయన విరాళంగా ఇచ్చారు. అలెన్ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 1983లో కేన్సర్ సోకడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.