యాప్నగరం

మిస్ యూనివర్స్‌గా ఫ్రాన్స్ అందాలరాణి

మిస్ యూనివర్స్‌గా ఫ్రాన్స్ అందగత్తే ఐరిస్ మిట్టెనెరె నిలిచింది.

TNN 30 Jan 2017, 2:24 pm
మిస్ యూనివర్స్‌గా ఫ్రాన్స్ అందగత్తే ఐరిస్ మిట్టెనెరె నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన 85 మంది అందమైన అమ్మాయిలను వెనక్కి తోసి అతిలోక సుందరిగా టైటిల్ కొట్టేసింది. ఐరిస్... కాబోయే సర్జన్. ప్రస్తుతం డెంటర్ సర్జరీ చదువుతోంది. వయసు 24 ఏళ్లు. ఈమె తరువాత మొదటి రన్నరప్‌గా హైతీ దేశానికి చెందిన రక్వెల్ పెలిస్సియర్, రెండో రన్నరప్ గా కొలంబియాకు చెందిన అండ్రూ తోవర్ నిలిచారు. వీరిలో రక్వెల్ ఘోర భూకంపం నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న యువతి. హైతీలో 2010లో భూకంపం సంభవించింది రక్వెల్ నివసిస్తు్న్న గ్రామాన్ని సర్వ నాశనం చేసింది.
Samayam Telugu miss universe 2017 frances iris mittenaere gets the crown
మిస్ యూనివర్స్‌గా ఫ్రాన్స్ అందాలరాణి


మనదేశం తరుపున పోటీలో నిలిచిన రోష్మిత హరిమూర్తి టాప్ 13లో కూడా నిలువలేక వెనుదిరిగింది. ఈమె బెంగళూరుకు చెందిన అమ్మాయి. దాదాపు ఒక ఇండియన్ యువతి మిస్ యూనివర్స్ అయ్యి 17 ఏళ్లయ్యింది. 1994లో సుస్మిత సేన్ ఈ టైటిల్ గెలవగా, 2000లో లారా దత్తా తిరిగి మిస్ యూనివర్స్‌గా నిలిచి భారత్‌కు ఘనత సాధించిపెట్టింది. అనంతరం ఇంతవరకు మళ్లీ ఆ టైటిల్ ఎవరూ మన దేశానికి తీసుకురాలేదు.



మిస్ యూనివర్స్ పోటీలు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.