యాప్నగరం

ఎన్ఎస్‌జీ సభ్యత్వంపై భారత్‌కు రష్యా మద్దతు

ఢిల్లీ: అణు సరఫరా దారుల కూటమి (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం భారత్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

TNN 13 Jun 2016, 5:52 pm
అణు సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం భారత్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అమెరికా, మెక్సికో లాంటి దేశాలను ఒప్పొంచిన ప్రధాని మోడీ .. ఇప్పుడు ఆ కూటమిలో ప్రధాన సభ్యులైన రష్యా,చైనాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఉదయం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి అణు సరఫరాదారుల కూటమిలో సభ్యత్వంపై భారత్ కు మద్దతు తెలపాలని కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాల నుంచి సమచారం అందింది. ఎన్ఎస్‌జీ కూటమిలో అమెరికా, చైనా, రష్యాలతో సహా మొత్తం 42 దేశాలున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ మెజార్టీ సభ్య దేశాల మద్దతును కూడగట్టారు. తాజాగా ఇప్పుడు రష్యా మద్దతు కూడగట్టడంతో ఎన్ఎస్‌జీలో సభ్యత్వంపై భారత ఆశలు మరింత పెరిగాయి.
Samayam Telugu modi dials putin as china looks to delay nsg bid
ఎన్ఎస్‌జీ సభ్యత్వంపై భారత్‌కు రష్యా మద్దతు


ఇక మిగిలింది చైనానే...

ఎన్ఎస్‌జీ కూటమిలో భారత్ కు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రధానంగా వ్యతిరేస్తున్న దేశం ఒక్క చైనాయే అని చెప్పాలి . మొన్నటి వియన్నా లో జరిగిన ఎన్ఎస్‌జీ కూటమి భేటీలో భారత్‌కు సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా నిరసన గళం వినిపించింది. చైనాకు పలు దేశాలు మద్దతు పలకడంతో భారత సభ్యత్వ దరఖాస్తుపై చర్చ సీయోల్ లో జరిగే భేటీకి వాయదా పడింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మోడీ ఇటీవలే మరిన్ని దేశాల మద్దుతు కూడగట్టారు. తాజాగా రష్యా మద్దతు కూడా పొందారు. ఇదిలా ఉండగా చైనా మద్దతు కూడా కూడగట్టేందుకు భారత ప్రధాని మోడీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సియోల్ భేటీ కంటే ముందే తాష్కెంట్ లో జరిగే ఎస్సీఓ సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యేందుకు మోడీ సిద్ధమయ్యారు. తాష్కెంట్ భేటీ తర్వాత భారత్ కు చైనా సంపూర్ణ మద్దుతు పలకడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. భారత్ తో చైనాకు ఉన్న వ్యాపార అవసరాల దృష్యా మోడీ అభ్యర్థనను చైనా అంగీకరిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.