యాప్నగరం

మయన్మార్ అధ్యక్షుడిగా... విన్‌మింట్ ఎన్నిక..!

మయన్మార్ అధ్యక్ష పదవికి తిన్ క్యా రాజీనామా చేయడంతో... ఆయన స్థానంలో ఆంగ్‌సాన్ సూకీ అనుచరుడు విన్‌మింట్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికోసం జరిగిన ఎన్నికల్లో... మయన్మార్ పార్లమెంటు మూడింట రెండు వంతుల ఓట్ల ఆధిక్యంతో ఆయనను ఎన్నుకుంది.

TNN 29 Mar 2018, 6:25 pm
మయన్మార్ అధ్యక్ష పదవికి తిన్ క్యా రాజీనామా చేయడంతో... ఆయన స్థానంలో ఆంగ్‌సాన్ సూకీ అనుచరుడు విన్‌మింట్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికోసం జరిగిన ఎన్నికల్లో... మయన్మార్ పార్లమెంటు మూడింట రెండు వంతుల ఓట్ల ఆధిక్యంతో ఆయనను ఎన్నుకుంది. విన్‌మింట్‌కు 403 ఓట్లు లభించగా సైన్యం తరపున పోటీ చేసిన మింట్‌ స్యూకు 211 ఓట్లు లభించాయి. ఉపాధ్యక్ష అభ్యర్థికి 18 ఓట్లు లభించాయి. ఇప్పటి వరకూ పార్లమెంట్‌ దిగువ సభ స్పీకర్‌గా వ్యవహరించిన విన్‌మింట్‌ గత వారం తన పదవికి రాజీనామా చేశారు.
Samayam Telugu myanmar


66 సంవత్సరాల విన్‌మింట్ 1951లో ఇరావడ్డీ డెల్టాలో జన్మించారు. యాంగాన్‌ యూనివర్సిటీ నుంచి భౌగోళిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత న్యాయడిగ్రీ పూర్తిచేసి... న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. 2010లో మొదటిసారి... ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

అధ్యక్షుడిగా ఆమె సన్నిహితుడు ఎన్నికైనప్పటికీ... రాజ్యాంగ బద్ధత లేకున్నా.... స్టేట్ కౌన్సెలర్ పదవిలో ఉంటూ దేశ పాలనావ్యవహారాలు తన చేజారిపోకుండా... ఆంగ్‌సాన్ సూకీ.... చూసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.