యాప్నగరం

భూమిపై జంతువుల ఆవిర్భావం గుట్టు తెలిసింది

భూమిపై తొలిసారిగా జంతువుల ఉనికి ఎలా ప్రారంభమయ్యిందనే రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గుట్టు బయటపెట్టింది.

TNN 17 Aug 2017, 2:09 pm
భూమిపై తొలిసారిగా జంతువుల ఉనికి ఎలా ప్రారంభమయ్యిందనే రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం మధ్య ఆస్ట్రేలియాలోని పురాతన అవక్షేప శిలల ఆధారంగా విశ్లేషించి, జంతువుల పరిణామ క్రియ సుమారు 650 మిలియన్ సంవత్సరాల కిందట ఆల్గే పెరుగుదలతో ప్రారంభమైనందని గుర్తించింది. ఈ అవక్షేప శిలలను పిండి చేసి, వాటి నుంచి పురాతన జీవుల అణువులను సేకరించామని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జోచేన్ బ్రాక్స్ పేర్కొన్నారు.
Samayam Telugu mystery of how first animals appeared on earth solved
భూమిపై జంతువుల ఆవిర్భావం గుట్టు తెలిసింది


శిలల్లోని అణువులు 650 మిలియన్ సంవత్సరాలు కిందట ఏర్పడినవి కావడం ఆశ్చర్యకరమైన అంశమని, ఇది పర్యావరణ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుని, ఆల్గే జీవుల ప్రారంభానికి కారణమైందని ఆయన తెలిపారు. భూగోళ చరిత్రలో ఆల్గే పురోగమనం అత్యంత లోతైన పర్యావరణ విప్లవాల్లో ఒకటి... ఇది లేకుండా మానవులతోపాటు ఇతర జంతువులకు మనుగడు లేదని బ్రోక్స్ అన్నారు. దీనికి 50 బిలియన్ సంవత్సరాల పూర్వం జరిగిన నాటకీయ పరిణామాలను స్నోబాల్ ఎర్త్‌గా పిలుస్తున్నారని ఆయన వివరించారు. సుమారు 50 మిలియన్ ఏళ్ల కిందట భూమి ఘనీభవించిందని, భారీ హిమానీనదాలతోపాటు మొత్తం పర్వత శ్రేణులు పొడిగా మారి భూమికి పోషకాలను విడుదల చేశాయని, గ్లోబల్ వార్మింగ్, అధిక ఉష్ణోగ్రత కారణంగా మంచు కరిగినపుడు ఈ పోషకాలు సముద్రాల్లోకి చేరినట్లు గుర్తించారు.

మహాసముద్రాలలో అత్యధిక స్థాయి పోషకాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి తగ్గడం వల్ల ఆల్గే వేగవంతంగా వ్యాప్తి చెందడానికి పరిపూర్ణ పరిస్థితులను సృష్టించాయి. దీంతో సంక్లిష్ట జీవనం ద్వారా నివసించే బాక్టీరియా ఆధిపత్యం మహాసముద్రాల నుంచి పరివర్తనం చెందింది. భారీ మొత్తంలో పోషకాలు సంక్లిష్ట పర్యవారణ వ్యవస్థల పరిణామానికి అవసరమైన శక్తిని అందించి, భూమిపై మానవులతో సహా జంతువులు వృద్ధికి సహాయపడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.