యాప్నగరం

యూరీ దాడి ‘కాశ్మీర్’ ప్రజల ప్రతీకార చర్య

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరొక్కసారి నోరుపారేసుకున్నారు.

TNN 24 Sep 2016, 1:45 pm
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరొక్కసారి నోరుపారేసుకున్నారు. యూరీ ఘటనను ఎలాంటి ఆధారాలు లేకుండా పాక్ పై రుద్దేందుకు భారత్ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేశారు. లండన్ లో ఉన్న ఆయనను విలేకరులు యూరీ ఘటన విషయమై ప్రశ్నించారు. ఆ సమయంలో నవాజ్ షరీఫ్ పై విధంగా స్పందించాడు. బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ అనంతరం కాశ్మీర్ లో రెండు నెలలు అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ నవాజ్ షరీఫ్ ... కడుపు మండిన కాశ్మీర్ ప్రజల ప్రతి చర్యే యూరీ ఘటన కావొచ్చని అన్నారు. రక్తసంబంధీకులను కోల్పోయిన వారి ఆగ్రహం ఆ రూపంలో కనిపించి ఉండొచ్చని అన్నారు. భారత్ ఎలాంటి ఆధారం చూపించకుండా పాకిస్తాన్ పై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా పాక్ ను ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ప్రపంచమంతటికి కాశ్మీర్ ప్రజలపై భారత్ చేస్తున్న అరాచకాలు తెలుసని, మొన్నటి అల్లర్లలో 108 మంది మరణించగా, 150 మంది అంధులుగా మారారని అన్నారు.
Samayam Telugu nawaz shariff criticized india for blaming pakistan without any evidence
యూరీ దాడి ‘కాశ్మీర్’ ప్రజల ప్రతీకార చర్య


యూరీ సెక్టార్ లో ఆదమరుపులో ఉన్న సైనికులపై పాక్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి 18 మందిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పాక్, భారత్ మధ్య యుద్ధవాతావరణాన్ని కల్పించింది. అయితే ఇది పాక్ పై ప్రతీకార చర్యకు సమయం కాదని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.