యాప్నగరం

అక్కడ న్యూ ఇయర్ సంబరాలు అదిరిపోయాయి!

కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తొలుత ప్రారంభమైన న్యూ ఇయర్ వెలుగులు అక్కడి నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌ను తాకాయి.

TNN 31 Dec 2016, 7:12 pm
కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తొలుత ప్రారంభమైన న్యూ ఇయర్ వెలుగులు అక్కడి నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌ను తాకాయి. ఆక్లాండ్‌లో స్కైసిటీ ఈవెంట్ సెంటర్ వద్ద వేలాదిగా గుమిగూడిన ఔత్సాహికులు బాణసంచా వెలుగుల మధ్య 2017కి స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Samayam Telugu new year celebrations fireworks light up auckland and sydney harbour
అక్కడ న్యూ ఇయర్ సంబరాలు అదిరిపోయాయి!


అనంతరం కొద్ది సేపటికి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో న్యూ ఇయర్ సంబరాలు ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్ వద్దకు వేలాదిగా చేరుకున్న ప్రజలు కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా 2016లో మరణించిన ఇద్దరు మ్యూజిక్ సూపర్‌స్టార్స్ ప్రిన్స్, డేవిడ్ బోవెకి బాణసంచా వెలుగులతో నివాళులర్పించారు. ప్రస్తుతం ఈ న్యూ ఇయర్ జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్... మీదుగా ఇండియా వైపునకు పయనిస్తోంది.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో న్యూ ఇయర్ సంబరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.