యాప్నగరం

న్యూయార్క్‌ అటార్నీ జనరల్ ఎరిక్‌ ష్నైడర్‌మెన్ రాజీనామా!

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ఎరిక్‌ ష్నైడర్‌మెన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించే, అలాగే మహిళల సమస్యలపై పోరాడే ఆయనపైనే నలుగురు మహిళలు ఆరోపణల చేయడం విశేషం.

TNN 8 May 2018, 8:48 pm
న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ఎరిక్‌ ష్నైడర్‌మెన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించే, అలాగే మహిళల సమస్యలపై పోరాడే ఆయనపైనే నలుగురు మహిళలు ఆరోపణల చేయడం విశేషం. ఆయన తమతో ప్రేమాయణం సాగించి, భౌతికంగా దాడి చేసి హింసించేవాడని వారు ఆరోపించారు. అయితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వారిలో ఇద్దరి కథనాలను 'ద న్యూ యార్కర్‌' ప్రచురించింది. వీరిద్దరూ ఆయన మాజీ స్నేహితులే కావడం విశేషం. ఆరోపణల నేపథ్యంలో...న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో, రాజీనామా చేయాలని ష్నైడర్‌మెన్‌కు సూచించారు. దీంతో ఆ ఆరోపణలతో సంబంధంలేనప్పటికీ తాను రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఎరిక్‌ ప్రకటించారు.
Samayam Telugu eric-schneiderman


ఈ ఆరోపణలపై స్పందించిన ఆయన.. 'సన్నిహత సంబంధాల గోప్యతకు, పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక కార్యకలాపాలకు తాను విలువిస్తానన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. పరస్పర అంగీకారం లేని సెక్స్ లో ఎప్పుడూ పాల్గొనలేదని, ఆ హద్దులను దాటలేదని అన్నారు. ఆరోపణలతో వివాదం తీవ్రం కావడంతో తాను పదవినుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన వృత్తిపరమైన ప్రవర్తనకు, విధులకు ఈ ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. గవర్నర్ ఆదేశం మేరకే రాజీనామా చేసినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.