యాప్నగరం

ట్రంప్‌ వ్యవహారశైలే అంత: నిక్కీ హేలీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీహేలీ విమర్శలు చేశారు. ఆయన తీరు కొంతమేర ఇబ్బందిగా ఉంటుందని ఆమె అన్నారు. దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగింపునకు ఇది సంక్లిష్టంగా మారుతుందని ఆమె తెలిపారు. ట్రంప్‌ వ్యవహారశైలే అంత... దానిని మనం సమర్థించలేమని అన్నారు.

TNN 8 May 2018, 5:58 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీహేలీ విమర్శలు చేశారు. ఆయన తీరు కొంతమేర ఇబ్బందిగా ఉంటుందని..దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగింపునకు ఇది సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'ట్రంప్‌ వ్యవహారశైలే అంత... దానిని మనం సమర్థించలేం' అని అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో లాటిన్‌ అమెరికా దేశాలు నిర్లిప్త వైఖరి అనుసరిస్తున్నాయంటూ ఇటీవల ట్రంప్‌ చేసిన వ్యాఖ్యతలో తాను విభేదిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Samayam Telugu nikky


2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ దర్యాప్తును అధ్యక్షుడు ట్రంప్ ముగించకూడదని ఆమె అన్నారు. దీనిపై విచారణను త్వరగా పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.