యాప్నగరం

ఉత్తరకొరియా ఎందుకిలా అమెరికాను రెచ్చగొడుతోంది?

ఉత్తర కొరియా తన దుందుడుకుతనాన్ని అలాగే కొనసాగిస్తోంది. అగ్రరాజ్యం యుద్ధానికి కాలు దువ్వుతోంది.

TNN 30 May 2017, 8:48 am
ఉత్తర కొరియా తన దుందుడుకుతనాన్ని అలాగే కొనసాగిస్తోంది. అగ్రరాజ్యం యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఉత్తర కొరియా ఎంతలా రెచ్చగొడుతున్నా అమెరికా కాస్త సంయమనంగానే ఉంటూ వస్తోంది. అయినా ఉత్తరకొరియా అధ్యక్షుడు మాత్రం అగ్రరాజ్యాన్ని మరింత రెచ్చగొట్టేలా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు. సోమవారం కూడా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేశారు. కేవలం అమెరికాకు వార్నింగ్ ఇవ్వడానికే ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. అమెరికా గతంలోనే ఉత్తర కొరియాకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఆయుధాల పరీక్షలకు పోవద్దని... లేకుంటే సైనిక చర్యకు దిగాల్సి వస్తుందని చెప్పింది. సైనిక చర్యకు దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని కూడా ఆ దేశ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు.
Samayam Telugu north korea fires short range ballistic missile test successful
ఉత్తరకొరియా ఎందుకిలా అమెరికాను రెచ్చగొడుతోంది?


తాజా క్షిపణి ప్రయోగంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సోమవారం పరీక్షించిన క్షిపణి... 450 కి.మీ ప్రయాణించి జపాన్ సముద్రతలాల్లో కూలిపోయింది. ఈ క్షిపణితో ఈ ఏడాది 12 క్షిపణులు ప్రయోగించినట్టయ్యింది. అమెరికా భూభాగాన్ని తాకే ఖండాంతర క్షిపణిని తయారుచేసే పనిని ముమ్మరం చేసింది ఉత్తరకొరియా. ఈలోపే అమెరికా సైనిక చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంది... అయితే జరగబోయే ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని ఊహించి వెనకడుగు వేస్తోంది. ఉ.కొ మాత్రం అగ్రరాజ్యాన్ని తన చర్యలతో రెచ్చగొడుతూనే ఉంది. తన దేశ ప్రజల రక్షణను మరిచి ఆ దేశ అధ్యక్షుడు ఎందుకిలా సైనిక చర్యకు ఉవ్విళ్లూరుతున్నాడేనేదే చర్చకు దారితీస్తోంంది. ప్రశాంతంగా ఉన్న దేశంలో రక్తపుటేరులు కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు సిద్ధపడుతున్నాడో కూడా అర్థం కావడం లేదని కొన్ని దేశాల అధ్యక్షులు అంటున్నారు.పరిస్థితులు ఎంతవరకు వెళుతుందో అని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.