యాప్నగరం

మా అంతరంగిక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోంది!

అమెరికా మాయలో పడిన చైనా పెద్ద తప్పు చేస్తోందని ఉత్తరకొరియా అధికార పత్రిక రోడాంగ్ సిమోన్ ఆరోపించింది. చైనా తీరును విమర్శిస్తూ ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

TNN 3 Oct 2017, 8:27 am
అమెరికా మాయలో పడిన చైనా పెద్ద తప్పు చేస్తోందని ఉత్తరకొరియా అధికార పత్రిక రోడాంగ్ సిమోన్ ఆరోపించింది. చైనా తీరును విమర్శిస్తూ ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తమ అంతరంగిక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని కథనంలో మండిపడింది. అంతే కాదు చైనాతో అమెరికా బంధం బలపడుతోందని వ్యాఖ్యానించింది. దీనికి సాక్ష్యం అమెరికా జాతీయభద్రతా కార్యదర్శి రెక్స్ టిల్లెర్సన్ ఇటీవల చైనాలో పర్యటించడమేనని పేర్కొంది. ఈ బంధం వెనుక బలమైన కారణం ఉత్తరకొరియాను నాశనం చేయడమేనని స్పష్టం చేసింది. తమకు చైనాతో సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని తెలిపిన ఆ పత్రిక...ఇప్పుడా బంధం బీటలు వారిందని తెలిపింది.
Samayam Telugu north korea mouthpiece rodong sinmun criticized china
మా అంతరంగిక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోంది!


తమపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతుంటే దానికి చైనా అభ్యంతరం చెప్పకపోవడం చూస్తుంటే... డ్రాగన్ కూడా ఈ కుట్రలో భాగమైందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆ పత్రిక ఆక్షేపించింది. గతంలోనూ చైనాపై రోడాంగ్ సిమోన్ పత్రిక ఆరోపణలు గుప్పించింది. ఉత్తర కొరియా అణు పరీక్షలపై చైనా విమర్శించడాన్ని తప్పుబడుతూ ఓ కథనం వెలువరించింది. తమ అణు కార్యక్రమంపై చైనా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసిందని మండిపడింది. అంతేకాదు డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ కొరియా సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని చైనాను హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.