యాప్నగరం

చైనా, రష్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా!

అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం సంభవించే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీని కోసం దక్షిణ కొరియా, జపాన్ సముద్ర తీరాల్లో అమెరికా సర్వసన్నద్ధంగా ఉంది.

TNN 16 May 2017, 11:50 am
అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం సంభవించే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీని కోసం దక్షిణ కొరియా, జపాన్ సముద్ర తీరాల్లో అమెరికా సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు ఉత్తరకొరియా కూడా తాము కూడా తక్కువేం కాదంటూ యుద్ధానికి సిద్ధమైంది. కిమ్ జోంగ్ పీచమణుస్తామని అమెరికా ప్రగల్భాలు పలుకుతుంటే, మీకు అంత దమ్ముందా అంటూ ఉత్తర కొరియా సవాల్ విసిరింది. ఈ క్రమంలో అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం వెరవకుండా ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడంతో ట్రంప్ ఆలోచనలు, వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉత్తర కొరియా ఇంతటి సాహసం చేయడానికి రష్యా, చైనాలే కారణమని గ్రహించింది. దీంతో ఏమాత్రం తొందరపడ్డా భారీ నష్టం చవిచూడాల్సి అమెరికా భావిస్తోంది.
Samayam Telugu north korea poses existential threat us intel chief warns
చైనా, రష్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా!


నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర కొరియాపై దాడికి దిగిన మరుక్షణమే అమెరికా ఉపగ్రహ వ్యవస్థను కుప్పకూల్చడానికి రష్యా, చైనాలు వ్యూహం పన్నినట్లు గుర్తించాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమయితే మాత్రం ఆ రెండు దేశాలు తమ ఉపగ్రహ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా చేస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. రష్యా, చైనాలకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ డేనియల్ కోట్స్ హెచ్చరించారు. ఈ రెండు దేశాలు ఏకమైనా తమ ఉపగ్రహ వ్యవస్థను ఏమీ చేయలేవని అన్నారు. ఉపరితలం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గరున్నాయని ఆయన పేర్కొన్నాడు.

అత్యవసర సమయంలో తప్ప వాటిని ఎప్పుడు పడితే అప్పుడు ప్రపయోగించబోమని డేనియల్ స్పష్టం చేశారు. కానీ తమకు ప్రమాదం తలపెట్టడానికి చూస్తే మా ఏర్పాటు మాకు ఉన్నాయని ఆయన వివరించారు. ఆయుధాలు ప్రపంచ వినాశానాన్ని కోరుకుంటాయని, వాటి వినియోగం ఎంత తక్కువ అయితే మానవాళికి అంత మంచి జరుగుతుందని అన్నారు. చైనా, రష్యాలు తమ ఉపగ్రహ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తే, వాటిపై దాడి చేయడానికి నిమిషం కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. అంతే కాదు అమెరికాతో సరితూగే ఉపగ్రహ వ్యవస్థను రూపొందించడానికి ఆ రెండు దేశాలకు ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. రష్యా, చైనాల యుద్ధతంత్రాలను తాము అంచనా వేయగలమని డేనియల్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.