యాప్నగరం

ఒలంపిక్స్ పతకాలు తేనివారికి ఆ దేశంలో శిక్ష

ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ అంతుబట్టదు. ఎందుకంటే ఈయనో నియంత అంతకు మించి పెద్ద సైకో.రియో ఒలంపిక్స్ కు వెళ్ళే ముందు క్రీడాకారులకు మొత్తం 17 పతకాలు దేశానికి తీసుకురావాలని...

TNN 25 Aug 2016, 3:28 pm
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ అంతుబట్టదు. ఎందుకంటే ఈయనో నియంత అంతకు మించి పెద్ద సైకో. తన పిచ్చితో దేశంలో పిచ్చి పిచ్చి విధానాలన్నీ అమలు చేస్తూ ఉంటాడు. కోపం వస్తే ఎంతటి పెద్ద అధికారినైనా చంపేస్తాడు. తాజాగా ఆయనకు తమ దేశ క్రీడాకారులపై కోపం వచ్చింది. రియో ఒలంపిక్స్ కు వెళ్ళే ముందు క్రీడాకారులకు చెప్పాడంట. కనీసం 5 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 17 పతకాలు దేశానికి తీసుకురావాలని హెచ్చరించాడట. కానీ వారి అథ్లెట్స్ 2 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 7 పతకాలు మాత్రమే తెచ్చారు. అంతేకాకుండా వారి శత్రుదేశమైన దక్షిణ కొరియా అథ్లెట్ల చేతిలో కూడా కొన్ని ఈవెంట్లలో వీరు ఓడిపోయారు. దీంతో కిమ్ జోంగ్ కు పిచ్చి కోపం వచ్చింది. పతకాలు తేని క్రీడాకారులందరూ బొగ్గు గనుల్లో పనులు చేయాలని ఆదేశించాడట. పతకాలు తెచ్చిన వారిని మాత్రం సత్కరించాడు. పాపం ఆ దేశ క్రీడాకారుల పరిస్థితి దారుణంగా తయారైంది.
Samayam Telugu north korean olympians facing angry of kim kim jong un
ఒలంపిక్స్ పతకాలు తేనివారికి ఆ దేశంలో శిక్ష


కిమ్ జోంగ్, ఉత్తర కొరియా దేశాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తాడు. దేశంలో అందరినీ శాసిస్తాడు. ఇతర దేశాలని హెచ్చరిస్తాడు. తమకు అడ్డొస్తే ఏ దేశాన్నైనా నాశనం చేస్తానని హెచ్చరిస్తాడు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాపైనే అణుబాంబు వేస్తానని హెచ్చరించాడు. సాంపుల్ గా అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు కూడా నిర్వహిస్తాడు. నిన్న బుధవారం కూడా ఓ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇటీవల నిర్వహించిన ఓ క్షిపణి ప్రయోగం వల్ల కృత్రిమ భూకంపానికి కారణమయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.