యాప్నగరం

అమెరికాలో కాల్పులు.. షూటర్‌ని కాల్చి చంపిన పోలీసులు

అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు...

TNN 28 Nov 2016, 11:40 pm
అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడినట్టు కొలంబస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. చివరకు కాల్పులకు పాల్పడిన షూటర్‌ని పోలీసులు కాల్చిచంపినట్టుగా అమెరికన్ మీడియా పేర్కొంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది అని సీఎన్ఎన్ వెల్లడించగా... ఇద్దరి పరిస్థితి నిలకడగానే వున్నప్పటికీ, మిగతావారి పరిస్థితి ఏంటో తెలియరాలేదు అని ఎన్‌బీసీ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది.
Samayam Telugu ohio state university shooting 7 injured shooter shot dead
అమెరికాలో కాల్పులు.. షూటర్‌ని కాల్చి చంపిన పోలీసులు


యూనివర్శిటీ క్యాంపస్‌లో కాల్పులకి పాల్పడుతున్న షూటర్ ఉన్నందున.. అందరూ సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిందిగా యూనివర్శిటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ స్టూడెంట్స్, స్టాఫ్‌ని అప్రమత్తం చేసింది. అమెరికాలోని అతిపెద్ద యూనివర్శిటీలో ఓహియో స్టేట్ యూనవర్శిటీ కూడా ఒకటి. ఇక్కడి క్యాంపస్‌లో దాదాపు 60,000 మంది స్టూడెంట్స్ ఉంటారని అంచనా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.