యాప్నగరం

పాకిస్థాన్‌లో లీటర్ పాలు రూ. 140, పెట్రోల్ ధరే కాస్త బెటర్..

Pakistanలో పెట్రోల్ ధర తక్కువేం కాదు. కానీ పాల ధర మాత్రం రూ.140 పలికింది. మొహర్రం సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతంగా పాల ధర పెరగడంతో జనం గగ్గోలు పెట్టారు.

Samayam Telugu 11 Sep 2019, 3:27 pm
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కంటే మన దగ్గరే పెట్రోల్ రేటు ఎక్కువని.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడలా.. సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. కానీ పాకిస్థాన్‌లో లీటర్ పాల ధర పెట్రోల్ ధరను మించపోయింది. మొహార్రం సందర్భంగా మంగళవారం పాకిస్థాన్‌లో లీటర్ పాలను రూ.140కి విక్రయించారు. కరాచీలో పాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ ధరను పెట్టి మరీ పాలను కొనాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ 90 పాకిస్థానీ రూపాయలు ఉండగా.. డీజిల్ రూ.91 రూపాయలు ఉంది.
Samayam Telugu pak milk


వాస్తవానికి లీటర్ పాలను గరిష్టం రూ.94కే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రిటైల్ ధరను రూ.110గా నిర్ణయించారు. కానీ దుకాణదారులు లీటర్ రూ.140 చొప్పున పాలను విక్రయించారు.

మొహర్రం సందర్భంగా కరాచీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పాలు, పళ్లరసాలు, చల్లటి నీళ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాల డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఇదే అదనుగా వ్యాపారులు కృతిమ కొరత సృష్టించారు. దీంతో పాల ధరలు పెరిగాయి.

జీవితంలో ఇప్పటి వరకూ పాల ధర ఇంత పలకడం ఎప్పుడూ చూడలేదని కరాచీ వాసులు వాపోతున్నారు. పాల ధరను నియంత్రించడానికి కరాచీ కమిషనర్ డాక్టర్ ఖటూ మల్ జీవన్ చర్యలేవీ తీసుకోవడం లేదనని వాపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.