యాప్నగరం

మా మంచితనాన్ని బలహీనతగా తీసుకోవద్దు

నియంత్రణ రేఖ దాటి భారత ఆర్మీ చేసిన దాడులపై పాక్ అధ్యక్షుడు స్పందించారు. 

TNN 29 Sep 2016, 3:43 pm
భారత ఆర్మీ బుధవారం అర్థరాత్రి పాక్ నియంత్రణ రేఖ (LOC) ను దాటి వెళ్లి దాడులు ప్రారంభించింది. దీనిపై గురువారం మధ్యాహ్నం భారత ఆర్మీ (Indian Army) అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన విషయం తెలిసిన అనంతరం పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (Nawaz shariff) భారత ఆర్మీ దాడులపై మాట్లాడినట్టు అక్కడి రేడియో ద్వారా తెలిసింది. శాంతి మంత్రాన్ని జపిస్తూ తాము సంయమనంతో ఉంటున్నామని, దానిని మా బలహీనతగా తీసుకోవద్దని భారత్ నుద్దేశించి అన్నారు. తమ సైన్యం అన్ని విధాలుగా సమర్థవంతమైన ఆర్మీ అని, ఎలాంటి పరిస్థితి వచ్చిన పోరాడుతుందని చెప్పుకొచ్చారు. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తే... తమ సైన్యం తగిన విధంగా సమాధానం చెబుతుందని అన్నారు.
Samayam Telugu our desire for peace should not be interpreted as our weakness says nawaz sharif
మా మంచితనాన్ని బలహీనతగా తీసుకోవద్దు


భారత ఆర్మీ డీజీఎమ్ఓ సింగ్ గురువారం మధ్యాహ్నం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes) గురించి ప్రకటించారు. ఆ ఆపరేషన్ పూర్తయిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.