యాప్నగరం

బాబ్బాబు.. బతికించండి: ఐరాసకు పాక్ మొర

జిత్తులమారి పాక్ మరోసారి కపట నాటకానికి తెరతీసింది. కశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అది కప్పిపుచ్చుకునేందుకే సరిహద్దుల్లో ఉద్రిక్తలను సృష్టిస్తోందంటూ ఐరాసకు మొర పెట్టుకుంది.

TNN 24 Nov 2016, 4:12 pm
న్యూయార్క్: కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ LoCలో అలజడి సృష్టిస్తున్న పాకిస్థాన్.. భారత సైన్యం ఎదురుదాడిని తట్టుకోలేక, నక్క జిత్తులు ప్రదర్శిస్తోంది. కొత్తగా శాంతి జపం చేస్తోంది. పాక్ సైనికులు కాల్పులతో తరచు కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా, భారత జవాన్లను దారుణంగా బలి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించడంతో పాక్‌ ఆత్మరక్షణలో పడింది. గురువారం పాకిస్థాన్ రాయబారి మలీహా లోధి ఐక్యరాజ్య సమితి (United Nations - UN) సెక్రటరీ జనరల్ జన్ ఎలియస్సన్‌ను కలిశారు. పాక్-భారత్ మధ్య నెలకున్న పరిస్థితులు అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతంగా మారున్నాయని ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది.
Samayam Telugu pak reaches out to un over loc issues
బాబ్బాబు.. బతికించండి: ఐరాసకు పాక్ మొర


శ్మీర్‌లోని మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేందుకు భారత్ ఉద్దేశపూర్వకంగానే LoCలో కల్లోలం సృష్టిస్తోందని ఆమె ఆరోపించింది. కాల్పుల్లో గాయపడినవారికి తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్సుపై భారత సైనికులు కాల్పులు జరిపారని, కనీస మానవీయ నిబంధనలను పాటించ లేదంటూ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్‌లకు యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ (UNMOGIP)ను పంపాలని, LoCలోని పరిస్థితులను లోతుగా పరిశీలించి ఉద్రిక్తతకు తెర దించాలని కోరింది.

గత కొద్ది రోజులుగా పాక్-భారత్ సరిహద్దుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బుధవారం భారత సైనికులు జరిపిన కాల్పల్లో ఏడుగురు మరణించినట్లు పాక్ తెలుపుతోంది. భారత సైనికుడిని దారుణంగా హత్యచేసి ముక్కలు చేశారనే ఆరోపణలను పాక్ ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.