యాప్నగరం

భారత్ కాల్పులకు పాల్పడుతుందంటూ పాక్ ఆరోపణ!

వాస్తవాధీన రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారని ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.

TNN 11 May 2017, 7:17 pm
వాస్తవాధీన రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారని ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సరిహద్దులు వెంబడి భారత సైన్యం కాల్పులకు పాల్పడటంతో ఒకరు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి సంబంధించి డిప్యటీ హై కమీషనర్ జేపీ సింగ్‌ను పాక్ అధికారులు పిలిచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టాండర్, సబ్జ్‌కోట్, ఖురియట్ట, బరోన్, బగ్సార్, ఖాంజర్ ప్రాంతాల్లో భారత్ సైన్యం కాల్పులకు జరిపినట్లు పాక్ విదేశీ వ్యవహారాల అధికారి ప్రతినిధి నఫీజ్ జకీర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
Samayam Telugu pak summons indias deputy high commissioner over loc firing
భారత్ కాల్పులకు పాల్పడుతుందంటూ పాక్ ఆరోపణ!


మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని నౌషెరా తాలూకాలో పాఠశాలను ముందు జాగ్రత్తగా మూసేశారు. ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పాక్ సైనికులు కాల్పులు ఉల్లంఘానికి పాల్పడి నౌషెరా సెక్టార్‌లో కాల్పులకు పాల్పడటంతో ఓ 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

జమ్మూకశ్మీర్‌ పూంఛ్‌లో నియంత్రణ రేఖ వద్ద మే 1 ఉదయం 8.30 గంటల సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఓవైపు కాల్పులు జరుగుతుండగానే మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) సభ్యులు 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చింది. పాక్‌ సైనికులతోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉన్న బీఏటీ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారితోపాటు, బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతే కాదు అత్యంత పైశాచికత్వంగా ఈ జవాన్ల మృత‌దేహాలను ముక్కలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.