యాప్నగరం

‘విశ్లేషిస్తున్నాం, జాదవ్ క్షమాభిక్షను త్వరలోనే తేల్చేస్తాం’

భారతీయుడైన కుల్‌‌భూషణ్ జాదవ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా విశ్లేసిస్తున్నారు.

TNN 16 Jul 2017, 7:16 pm
భారతీయుడైన కుల్‌‌భూషణ్ జాదవ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తమ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా విశ్లేషిస్తున్నారని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. జాదవ్ క్షమభిక్ష అంశంపై సాధ్యమైనంత త్వరలో బజ్వా నిర్ణయం తీసుకుంటారని పాక్ సైన్యం తెలిపింది. రావల్పిండిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేజర్ జనరల్, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Samayam Telugu pakistan army chief analysing evidence against kulbhushan jadhav ispr
‘విశ్లేషిస్తున్నాం, జాదవ్ క్షమాభిక్షను త్వరలోనే తేల్చేస్తాం’


గత నెలలో అప్పిలేట్ కోర్టు జాదవ్ క్షమాభిక్ష అపీల్‌ను కొట్టివేయగా.. తదనంతరం ఆయన ఆర్మీ చీఫ్‌‌ను క్షమాభిక్ష కోరారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ నివేదిక వెల్లడించింది. కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ.. భారత్ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నౌకాదళ మాజీ అధికారి అయిన జాదవ్.. ఇరాన్‌లో ఉండగా పాక్ సైన్యం అపహరించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అభియోగాలపై పాక్ కోర్టు అతడికి మరణ దండన విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.