యాప్నగరం

అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం: పాక్ ఏసీజీ

పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెన్ బజ్వా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతియుత చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యతోపాటు రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కారం దొరకుతుందనే విశ్వాసం ఉందన్నారు.

TNN 16 Apr 2018, 11:28 am
పాకిస్థాన్ తీరు చూస్తుంటే మాటల్లో... తేనె పలుకులు, చేతల్లో కత్తిపోట్లు అన్న చందంగా తయారైంది. ఒకవైపు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే విచ్చల విడిగా కాల్పులు జరుపుతూనే... మరోవైపు శాంతిని కోరుకుంటన్నట్లు ప్రకటనలు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ (ఏసీజీ) కమర్ జావెన్ బజ్వా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతియుత చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యతోపాటు రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కారం దొరకుతుందనే విశ్వాసం ఉందన్నారు. పాకిస్థాన్ ఎప్పుడూ పొరుగుదేశాలతో సత్సంబంధాలు, శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటుందని తెలిపారు. పాకిస్థాన్‌ను సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దడానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. దీనిపై ఎవరి ఒత్తిడి లేదు. మమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేమని తెలిసిన శత్రుదేశాలు మమ్మల్ని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Samayam Telugu bajkwa


దేశ గౌరవానికి భంగం కలుగనంతవరకే తాము నియంత్రణలో ఉంటామని... శాంతి కావాలని కోరుకోవడాన్ని మా బలహీనత అనుకోవద్దన్నారు. పాక్ భద్రతా బలగాలకు ఎలాంటి శత్రువునైనా ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ను సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దడానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. తీవ్రవాదాన్ని ఏరివేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.