యాప్నగరం

పాక్‌లో మరో ముగ్గురు భారతీయుల అరెస్ట్

గూఢచర్యం పేరుతో ఇండియన్ నేవీ రిటైర్డ్ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష విధించిన పాకిస్థాన్ మరో ముగ్గురు

TNN 15 Apr 2017, 3:39 pm
గూఢచర్యం పేరుతో ఇండియన్ నేవీ రిటైర్డ్ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష విధించిన పాకిస్థాన్ మరో ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్ అరెస్టు చేశామని చెబుతున్న ముగ్గురు కూడా గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించడం గమనార్హం.
Samayam Telugu pakistan arrests 3 indian raw spies targeting cpec
పాక్‌లో మరో ముగ్గురు భారతీయుల అరెస్ట్


‘ఖలీల్, ఇమ్తియాజ్, రషీద్ అనే ముగ్గురిని అరెస్టు చేశాం. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ (ర) ఆదేశాల మేరకు ఈ ముగ్గురు పాకిస్థాన్ లో గూఢచర్యానికి పాల్పడుతున్నారు. చైనా పాకిస్థాన్ ఎకానమిక్ కారిడర్ లో వీరు నిఘా పెట్టి విలువైన సమాచారాన్న తస్కరిస్తున్నారు’ అని పాకిస్థాన్ కు చెందిన ఒక పోలీస్ అధికారి ఆ దేశ ఛానల్ జియో న్యూస్ కు వెల్లడించారు.

ఈ ముగ్గురిని భారత్ ‘ర’ ఏజెంట్లుగా నియమించిందని పాకిస్థాన్ వాదిస్తోంది. అరెస్టయిన ముగ్గురిపై పాకిస్థాన్ యాంటి టెర్రరిస్టు యాక్ట్ పై కేసు నమోదు చేశారు.

అరెస్టయిన వారు గూఢచర్యానికి పాల్పడుతున్నామని అంగీకరించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు.

ఇటీవల రిటైర్డ్ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఇండియన్ ‘స్పై’ అంటూ ఆయనకు ఉరిశిక్ష విధించారు. జాదవ్ కు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి ఆయన్ను తక్షణం విడుదల చేయాలని భారత్ పోరాడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.