యాప్నగరం

ఆ ఉగ్రవాది తుపాకీ లైసెన్సు రద్దుచేసిన పాక్!

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ సహా అతని సంస్థలోని ఇతర సభ్యుల ఆయుధాలకు ఇచ్చిన లైసెన్సులను పాకిస్థాన్ రద్దుచేసింది.

TNN 21 Feb 2017, 8:42 pm
ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ సహా అతని సంస్థలోని ఇతర సభ్యుల ఆయుధాలకు ఇచ్చిన లైసెన్సులను పాకిస్థాన్ రద్దుచేసింది. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వారికిచ్చిన తుపాకుల లైసెన్సులు రద్దుచేస్తున్నట్లు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ హోం శాఖ వెల్లడించింది. మొత్తం 44 ఆయుధాలకు గతంలో ఇచ్చిన లైసెన్సులను రద్దుచేసినట్లు హోంశాఖ అధికారి ఒకరు స్పష్టం చేసారు.
Samayam Telugu pakistan cancels licences of 44 weapons issued to hafiz saeed and his aides
ఆ ఉగ్రవాది తుపాకీ లైసెన్సు రద్దుచేసిన పాక్!


కాగా, సయీద్‌తో పాటు మరో నలుగురు నేతలను జనవరి 30 నుంచి లాహోర్‌లో 90 రోజులపాటు పాకిస్థాన్ ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసింది. అలాగే దేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ATA) కిందికి హఫీజ్‌ను తీసుకొచ్చింది. ఇకపై అతని ప్రతి కదలికపై పాక్ ఆంక్షలు విధించింది. మరోవైపు 38 మంది పేర్లతో ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌ను పాక్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్ సయీద్‌తోపాటు అతని నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా, ఫలాహ్-ఏ-ఇన్సానియత్ దాతృత్వ సంస్థకు చెందిన 37 మంది నేతలు ఈ లిస్టులో ఉన్నారు. అంటే హఫీజ్‌తో పాటు ఈ లిస్టులో ఉన్న నేతలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని విడిచి వెళ్లకూడదు. ఆ ఉగ్రవాది తుపాకీల లైసెన్సులు రద్దుచేసిన పాక్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.