యాప్నగరం

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు మరణ శిక్ష

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష. దేశ ద్రోహం కేసులో శిక్ష విధించిన కోర్టు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు. 2007లో కేసుకు సంబంధించి శిక్ష.

Samayam Telugu 17 Dec 2019, 1:27 pm
పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. పాక్ మీడియా కథనం ప్రకారం.. దేశ ద్రోహం కేసులో స్పెషల్ కోర్టు.. ఈ మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆయన దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులపై విచారణ జరిపిన పెషావర్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దోషిగా తేల్చింది. ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్ మరణ శిక్షను సమర్థించగా.. మరొక న్యాయమూర్తి వ్యతిరేకించారు. మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయంతో మరణ శిక్ష ఖరారైంది.
Samayam Telugu mushraf


ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించి.. చాలామంది న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. అక్కడితో ఆగని ముషారఫ్.. మీడియాపై ఆంక్షలు విధించడంతో.. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది.

తర్వాత 2013లో ముషారఫ్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది.2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. తర్వాత కోర్టు సమన్లు పంపించినా స్పందించలేదు.. కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయన్ను అరెస్ట్ చేయాలని ఎఫ్‌ఐను ఆదేశించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇప్పుడు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.