యాప్నగరం

100 మంది మిలిటెంట్లని హతమార్చిన పాక్

పాక్‌లోని సింధ్ ప్రాంతంలో వున్న సుఫి పుణ్యక్షేత్రంపై గురువారం రాత్రి బాంబు దాడులకి పాల్పడిన ఇస్లామిక్ స్టేట్..

TNN 18 Feb 2017, 4:01 pm
పాక్‌లోని సింధ్ ప్రాంతంలో వున్న సుఫి పుణ్యక్షేత్రంపై గురువారం రాత్రి బాంబు దాడులకి పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాదాపు 80 మందిని పొట్టన పెట్టుకోవడంతో ఆలస్యంగా మేల్కొన్న పాక్... శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి దాదాపు 100 మంది మిలిటెంట్లని హతమార్చింది.
Samayam Telugu pakistan kills 100 militants after is attacks sufi shrine in sindh province
100 మంది మిలిటెంట్లని హతమార్చిన పాక్

సింధ్‌లో రాత్రికి రాత్రే 18 మంది టెర్రరిస్టులని హతమార్చినట్టు పారామిలిటరీ సింధ్ రేంజర్స్ ప్రకటించారు. మరోవైపు ఖైబర్ పంఖ్తుంఖ్వ ప్రాంతంలో 13 మంది టెర్రరిస్టులను, ఒరక్జై ఏజెన్సీలో నలుగురు, కరాచీలో నలుగురు ఉగ్రవాదులని మట్టుబెట్టినట్టుగా భద్రతావర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంటే, గురువారం రాత్రి ఉగ్రవాదులు బాంబుపేలుళ్లకి పాల్పడిన అనంతరం కొద్ది గంటల్లోనే 100 మంది ఉగ్రవాదులని హతమార్చడం సైతం కొన్ని విమర్శలకి తావిచ్చింది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మీ (ఆర్మీ) వద్ద ఉన్నప్పుడు, వాళ్లు దాడులకి పాల్పడి పౌరుల ప్రాణాలు తీయడానికన్నా ముందే మీరు ఎందుకు ఉగ్రవాదులని మట్టుబెట్టలేదని పరిశీలకులు విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు ఆర్మీనే ముందుగా దాడులకి పాల్పడి వుంటే, అంతమంది పౌరులు వారి దాడులకి బలయ్యేవాళ్లు కాదని పరిశీలకులు ఆవేదన వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.