యాప్నగరం

ఐసీజే తీర్పును సవాల్ చేయనున్న పాకిస్థాన్

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ కు విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం

TNN 19 May 2017, 7:31 pm
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ కు విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) పాకిస్థాన్ ను ఆదేశించడాన్ని ఆ దేశం తిరస్కరించింది. ఐసీజే తీర్పును సవాల్ చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ తీర్పును పున:సమీక్షించాలని పాకిస్థాన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెలువరించాయి.
Samayam Telugu pakistan moves icj to challenge kulbhushans case
ఐసీజే తీర్పును సవాల్ చేయనున్న పాకిస్థాన్


ఐసీజే ముందు పాకిస్థాన్ తరఫున వాదించిన కవార్ ఖురేషీనే కొనసాగించాలని పాకిస్థాన్ మొగ్గు చూపిస్తున్నట్లు దున్యా న్యూస్ పేర్కొంది. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన విషయమని.. ఐసీజే తీర్పును అంగీకరించేదని లేదని గురువారం పాకిస్థాన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కుల్ భూషణ్ తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని, దేశంలో ఉగ్రవాద చర్యలకు ప్రణాళిక రచించడాన్ని పాకిస్థానం ఆయనకు ఉరిశిక్ష విధించింది. దీనిపై భారత్ కాన్సులర్ యాక్సెస్ కోసం ప్రయత్నించినా పాక్ తిరస్కరించింది. తనపై విధించిన ఉరిశిక్షపై క్షమాబిక్ష కోసం జాదవ్ 60 రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీ, 90 రోజుల్లో ఆ దేశ రాష్ట్రపతిని కోరవచ్చని ఆ దేశం చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.