యాప్నగరం

పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా పరీక్షలు..? విరాళం అందజేసిన వ్యక్తికి కోవిడ్

Imran Khan కరోనా వైరస్ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే ఆయన్ను కలిసి కరోనా రిలీఫ్ ఫండ్‌ కోసం విరాళం ఇచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని తేలడమే దీనికి కారణం.

Samayam Telugu 21 Apr 2020, 10:54 pm
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది లేదంటే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఇటీవల ఇమ్రాన్‌కు పది లక్షల రూపాయల చెక్ అందజేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలడమే దీనికి కారణం. దివంగత అబ్దుల్ సత్తార్ ఎదీ.. దాతృత్వానికి పెట్టింది పేరు. ఆయన కుమారుడు, ఎదీ ఫౌండేషన్ చైర్మన్ అయిన ఫైజల్ ఎదీ ఏప్రిల్ 15న ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ను కలిసి చెక్ అందజేశారు. కొద్ది రోజుల తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
Samayam Telugu imran ho1


కరోనా పరీక్షలు చేయించుకోమని తమ ప్రధానికి సూచిస్తానని ఇమ్రాన్ పర్సనల్ ఫిజిషియన్, షౌకత్ ఖానుం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ సీఈవో అయిన ఫైజల్ సుల్తాన్ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం కరోనా బారిన పడిన వ్యక్తిని కలిసి వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచిస్తారు. దీంతో ఇమ్రాన్ కూడా దీన్ని పాటించే అవకాశం ఉంది.

కాగా కరోనా బారిన పడిన ఫైజల్ ఇప్పటి వరకూ హాస్పిటల్‌లో చేరలేదు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనలో నాలుగు రోజులపాటు కనిపించిన కరోనా లక్షణాలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి.

ఇప్పటి వరకూ పాకిస్థాన్‌లో 9565 కరోనా కేసులు నమోదు కాగా.. 201 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 17 గంటల్లోనే పాక్‌లో 673 కొత్త కేసులు నమోదు కాగా.. 25 మంది చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.