యాప్నగరం

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గొప్ప ఊరట

Vote Of Confidence: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఇటీవల సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ కేబినెట్ మంత్రి పరాజయం పాలయ్యారు. దీంతో పాక్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Samayam Telugu 6 Mar 2021, 5:22 pm
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (68)కు గొప్ప ఊరట లభించింది. పదవీ గండం నుంచి గట్టెక్కారు. పాకిస్థాన్ జాతీయ పార్లమెంట్‌లో శనివారం (మార్చి 6) జ‌రిగిన విశ్వాస ప‌రీక్షలో 178 ఓట్లతో ఇమ్రాన్ తన పదవిని కాపాడుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఆరు ఓట్లు ఎక్కువ‌గానే ప‌డ్డాయి. దీంతో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
Samayam Telugu ఇమ్రాన్ ఖాన్ (Photo: IANS)
Imran Khan


ఇటీవ‌ల పాకిస్థాన్ సెనేట్‌లో ఇమ్రాన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇమ్రాన్‌ను రాజీనామా చేయాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన విశ్వాస పరీక్షకు వెళ్లారు. ఒక దశలో రాజీనామా చేస్తారనే వదంతులు కూడా వ్యాప్తి చెందాయి.

శనివారం పాకిస్థాన్ పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిచి బల పరీక్ష నిర్వహించారు. మొత్తం 342 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో విశ్వాస ప‌రీక్ష నెగ్గేందుకు ఇమ్రాన్‌కు 172 ఓట్లు కావాల్సి ఉండగా.. ఆయనకు 178 మంది ఓటు వేశారు. త‌న‌కు ఓటేసిన పార్టీ ఎంపీలు, మిత్ర పక్షాల ఎంపీల‌కు ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా పాకిస్థాన్ డెమొక్రటిక్ మూమెంట్ కూటమిలోని 11 ప్రతిపక్ష పార్టీలు ఈ విశ్వాస పరీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం.

Also Read:

వీళ్లు చెత్త తీసుకెళ్తారా.. ఎంత స్వీట్ వాయిస్!

భర్త క్రాఫ్ చూసి మురిసిపోయిన భార్య.. కానీ, పెళ్లైన కొద్ది రోజులకే ట్విస్ట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.