యాప్నగరం

మన కంచె పక్కన కొత్త రాష్ట్రం ఏర్పాటుకు పాక్ పన్నాగాలు!

వివాదాస్పదమైన పీవోకేకు ఆనుకుని, దాదాపుగా అందులో కలిసినట్లుగా ఉండే గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతాన్ని ప్యత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయనున్నట్లు..

TNN 15 Mar 2017, 5:30 pm
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి మనల్ని కవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌‌కు ఆనుకొని ఉండే గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతాన్ని ఐదో ప్రావిన్సు‌గా ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయమై విదేశాంగ సలహాదారు సర్తరాజ్ అజిజ్‌తో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత శాఖ మంత్రి రియాజ్ హుస్సేన్ పిర్జాదా జియో టీవీకి తెలిపారు. గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతాన్ని ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసేందుకు ఆ కమిటీ కూడా సమ్మతించిందని ఆయన చెప్పారు. ఆ ప్రాంత హోదాను మార్చడం కోసం రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్లు రియాజ్ తెలిపారు.
Samayam Telugu pakistan set to declare gilgit baltistan as fifth province
మన కంచె పక్కన కొత్త రాష్ట్రం ఏర్పాటుకు పాక్ పన్నాగాలు!


గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతం గుండానే 46 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ వెళ్తోంది. ఇప్పటి వరకూ ఆ ప్రాంతాన్ని పాక్ ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా గుర్తిస్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతానికి అసెంబ్లీతోపాటు, సీఎం కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ పాక్‌లో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్ అనే నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. వివాదాస్పద పీవోకేతో సరిహద్దు నేపథ్యంలో పాకిస్థాన్ చర్యను భారత్ ఖండించే అవకాశాలు ఉన్నాయి. చైనా పాక్ కారిడార్‌కు న్యాయ పరంగా చిక్కులు రాకూడదదంటే.. ఆ ప్రాంత హోదాను మార్చాలని చైనా చేసిన ఒత్తిడి కారణంగానే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.