యాప్నగరం

ఓ వైపు ఉత్తర కొరియా.... తాజాగా పాకిస్థాన్

వరుస క్షిపణి, అణు పరీక్షలతో ఓ వైపు ఉత్తర కొరియా దూసుకుపోతుంటే, తాజాగా పాకిస్థాన్ కూడా అదే దారిలో పయనిస్తోంది.

TNN 6 Jul 2017, 12:25 pm
వరుస క్షిపణి, అణు పరీక్షలతో ఓ వైపు ఉత్తర కొరియా దూసుకుపోతుంటే, తాజాగా పాకిస్థాన్ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల చిన్న తరహా బాలిస్టిక్ క్షిపణి 'నాజర్'ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వెల్లడించారు. అత్యాధునికమైన ఈ క్షిపణిని ప్రయోగించడం సులువని, నిమిషాల్లోనే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన తెలిపారు. సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎక్కడి నుంచి నిర్వహించారనే విషయం మాత్రం ప్రకటించలేదు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత్ ప్రారంభించిన 'కోల్డ్ స్టార్ట్'పై తాము నీళ్లు చల్లినట్లయిందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu pakistan successfully test fires short range ballistic missile nasr
ఓ వైపు ఉత్తర కొరియా.... తాజాగా పాకిస్థాన్


పాక్ సైనిక శక్తిని వ్యూహాత్మకంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే క్షిపణి పరీక్ష చేపట్టామని అన్నారు. తమ దేశపు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని, దేశ రక్షణ, భద్రతా పర్యవేక్షణను సులభతరం చేసిందని చెప్పుకొచ్చారు. అయితే దీని వల్ల పొరుగు దేశాల శాంతికి ఎలాంటి భంగం వాటిళ్లదని తెలియజేశారు. అలాగే సాధ్యమైనంత వరకు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ప్రభుత్వం చర్యలకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. 'నాజర్' ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తదితరులు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.