యాప్నగరం

2019 ఎన్నికల తర్వాతే భారత్‌తో చర్చలు: ఇమ్రాన్ ఖాన్

భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వంతో వ్యాపార, సరిహద్దు ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.

Samayam Telugu 23 Oct 2018, 10:28 pm
భారత ఆర్మీ అమాయకులను పొట్టన పెట్టుకుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ద్వైపాక్షిక సంబందాలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మనసు మార్చుకున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత ద్వైపాక్షిక, శాంతి ఒప్పందాలపై చర్చిస్తామన్నారు. మరోవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్‌తో చర్చలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu Imran khan


సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నగరంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో మంగళవారం పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. తాను పాక్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగు పరుచుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వంతో వ్యాపార, సరిహద్దు ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. పాక్‌కు ఆర్థికంగా చేయూతనివ్వాలని పెట్టుబడుల సదస్సులో కోరారు. పాక్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఇమ్రాన్ వెల్లడించారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ను సైతం పాక్ ఆర్థిక సాయం కోరుతుందని, చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మిత్ర దేశాలు, ఇతరత్రా దేశాలు పాక్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపుపిచ్చారు. పొరుగు దేశాలతో తాను ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటానని, భారత్‌తో సైతం చర్చలకు ఎదురుచూస్తున్నా తమకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నారని పాక్ ప్రధాని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.