యాప్నగరం

రూ.5 వేల నోటు రద్దు చేయనున్న పాక్

పాకిస్తాన్ కూడా మన ప్రధానినే ఫాలో అవుతున్నట్టు ఉంది.

TNN 20 Dec 2016, 1:01 pm
పాకిస్తాన్ కూడా మన ప్రధానినే ఫాలో అవుతున్నట్టు ఉంది. ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకన్న సంగతి తెలిసిందే. అదే విధంగా పాక్ తమ దేశంలో పెద్ద నోటైన రూ.5వేల నోటును రద్దు చేయడానికి సిద్ధమైంది. తమ దేశంలో ఉన్న నల్లధనానికి అడ్డుకట్టే వేయడానికి పాక్ ఆ సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతోంది. పాకిస్తాన్ సెనేట్ పెద్ద నోట్లను రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. అయితే పెద్ద నోటును రద్దు చేయడం వల్ల మార్కెట్లపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని పాక్ పార్లమెంటు భావించింది.
Samayam Telugu pakisthan planning to demonetise 5000 rupee note
రూ.5 వేల నోటు రద్దు చేయనున్న పాక్


అందుకోసం నోట్ల ఉపసంహరణ రోజుల పరిమితితో కాకుండా మూడు నుంచి అయిదేళ్ల పాటూ చేయాలని కొంత మంది సభ్యులు సూచించారు. పాక్ లో ప్రస్తుతం 3.4లక్షల కోట్ల నోట్లు వాడుకలో ఉండగా అందులో 1.02 లక్షల కోట్ల సంఖ్యలో 5 వేల నోట్లే ఉన్నాయని పాక్ మంత్రి తెలిపారు. కనుక పెద్ద నోటు రద్దు వల్ల మార్కెట్లో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అయితే పార్లమెంటులో మెజారిటీ సభ్యులు రద్దుకే మొగ్గు చూపడంతో... 5000 నోటు రద్ద తప్పనట్టే కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.