యాప్నగరం

పాక్ ప్రధానికి ‘పనామా గండం’ సుప్రీం నోటీసు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ల లీకేజీ చుట్టుకుంటున్నాయి.

TNN 20 Oct 2016, 3:26 pm
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ల లీకేజీ చుట్టుకుంటున్నాయి. విదేశాల్లో షరీఫ్‌కు అతని కుటుంబ సభ్యులకు ఆస్తులున్నట్లు లీకు చేసిన పనామా పత్రాలు ఇప్పుడు అతని పదవి ఊడేందుకు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి.
Samayam Telugu panama papers leak case pakistan pm sharif is served notice by supreme court
పాక్ ప్రధానికి ‘పనామా గండం’ సుప్రీం నోటీసు


అధికారాన్ని అడ్డంపెట్టుకొని విదేశాల్లో అక్రమాస్తులు కూడబెట్టిన షరీఫ్‌ను పదవీచ్యుతుని చేయాలని ‘పాకిస్థాన్ తెహ్రరిక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లను పరిశీలించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులు చీఫ్ జస్టీస్ అన్వర్ జహీర్ జమాలీ, జస్టీస్ ఇజహుల్ అహసాన్, జస్టీస్ కిల్జీ ఆరీప్ హుస్సేన్ లతో కూడిన ధర్మాసనం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నోటీసు జారీ చేసింది.
షరిఫ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులైన మరియమ్ (కూతురు), హసన్, హుస్సేన్ (తనయులు), ముహ్మాద్ సఫ్దార్ (అల్లుడు)లు, ఆర్థికమంత్రి ఇషాక్ దర్, డైరెక్టర్ జనరల్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చైర్మన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, అటార్నీ జనరల్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తనకు తాను రాజులా వ్యవహరిస్తున్న ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కోర్టు ముందు నిలబెడ్తానని కేసు దాఖలు చేసిన ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిలో కొనసాగరాదని, ఇమ్రాన్ నవంబర్ 2న ఇమ్లామాద్ ముట్టడికి పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.