యాప్నగరం

సిరియాలో యూఎస్ స్థావరాలు వెల్లడితో...

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేయడానికి సిరియాలో అమెరికా ఏర్పాటు చేసుకున్న రహస్య యుద్ధ స్థావరాలను టర్కీ మీడియా బయటపెట్టడంతో పెంటగాన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

TNN 20 Jul 2017, 1:46 pm
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేయడానికి సిరియాలో అమెరికా ఏర్పాటు చేసుకున్న రహస్య యుద్ధ స్థావరాలను టర్కీ మీడియా బయటపెట్టడంతో పెంటగాన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిరియాలోని ఉత్తర ప్రాంతంలో 10 చోట్ల మిలటరీ స్థావరాలను అమెరికా ఏర్పాటు చేసినట్లు టర్కీ మీడియా ప్రచురించింది. ఇవి కుర్దిష్ వర్గాల స్వీయపాలన ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో ఇవి ఉన్నట్లు తెలిపింది. టర్కీకి చెందిన అనదోల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన ఈ సమాచారం పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఈ కథనాల్లో వెల్లడించిన ప్రాంతాల జాబితాను ఎక్కడ నుంచి సేకరించారన్న సమాచారం మా దగ్గర లేదు.... దీనిపై నాటో అధికారులతో మాట్లాడుతున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. స్థావరాల జాబితాను విడుదల చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం" అని పేర్కొంది. అంతేకాదు ఈ స్థావరాల వివరాలను సంకీర్ణ దళాల్లోని ఇతర దేశాల సైన్యానికి సైతం ఇంతవరకూ తెలియనీయలేదని, ఎలా ఈ వివరాలు ఎలా బయటకు వచ్చాయో విచారిస్తామని పెంటగాన్ పేర్కొంది.
Samayam Telugu pentagon furious after turkey leaks u s base locations in syria
సిరియాలో యూఎస్ స్థావరాలు వెల్లడితో...


టర్కీ న్యూస్ ఏజన్సీ 'అనడోలు' అమెరికన్ స్థావరాల గురించి గ్రాఫిక్ మ్యాప్స్ సహా ప్రచురిస్తూ, ఓ కథనాన్ని వెలువరించగా, దాన్ని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ నియంత్రణలో ఉన్న సిరియా ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. ఇక ఈ కథనాలతో అమెరికా నేతృత్వంలో సాగుతున్న ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి అవాంతరాలను తెచ్చి పెట్టవచ్చని పెంటగాన్ భావిస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో అమెరికా స్థావరాలను ఏర్పాటుచేయడంపై టర్కీ కూడా ఆగ్రహం వ్యక్తం చేంది. ఐఎస్ పేరుతో కుర్దిష్ వర్గాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు దాడులకు పాల్పడ్డారని బహిరంగంగా విమర్శించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.