యాప్నగరం

ఫైజర్ గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ 95% సక్సెస్, త్వరలో పంపిణీ

Covid-19 Vaccine: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ (Pfizer) గుడ్ న్యూస్ చెప్పింది. తమ వ్యాక్సిన్ 95 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. మూడో దశ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది.

Samayam Telugu 19 Nov 2020, 12:09 am
రోనా టీకా కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన టీకా 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను తెలిపింది. తమ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనా వైరస్ సోకకుండా నిరోధించడంలో 95 శాతం విజయవంతమైందని ప్రకటించింది. తమ టీకా ఎంతో సురక్షితమైనదని పునరుద్ఘాటించింది.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్
Corona vaccine updates in Telugu


మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో అన్ని వయస్సుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని ఫైజర్ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు ఏవీ లేవని వెల్లడించింది. కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉండే 65 ఏళ్ల పైబడినవారిలోనూ వ్యాక్సిన్ సమర్థత 94 శాతానికి పైగా ఉన్నట్టు చెప్పడం మరో విశేషం. 170 మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు ఈ వ్యాక్సిన్‌‌ను ఇవ్వగా.. తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు కనిపించినట్లు ఫైజర్ తెలిపింది.

జర్మన్‌కు చెందిన బయాన్‌టెక్‌ ఎస్‌ఈతో కలిసి ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. త్వరలో అత్యవసర వినియోగ అనుమతి కోసం ఎఫ్‌డీఏ (Food and Drug Administration)కు దరఖాస్తు చేయనున్నట్టు తెలిపింది. కరోనా విలయంతో అల్లాడుతున్న అమెరికాకు ఇది పెద్ద ఊరట కలిగించే అంశం.

అయితే.. ఫైజర్ టీకాను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి ఫైజర్ ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు.

మరోవైపు.. ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలనే వార్త సవాల్‌గా మారింది. దీంతో చాలా దేశాలు ఆ వ్యాక్సిన్‌‌ను కొనుగోలు చేయాలా? వద్దా అని ఆలోచిస్తున్నాయి. భారత్‌తో పాటు చాలా దేశాల్లో ఆ ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వ చేసే వసతులు లేవు.

Also Read: ఢిల్లీలో భారీ దాడికి ఉగ్రవాదుల స్కెచ్.. భగ్నం చేసిన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.