యాప్నగరం

జుకెర్‌బర్గ్ దాతృత్వం: సేవ కోసం రూ. 77వేల కోట్ల విరాళం

ఫేస్‌‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ రానున్న 18 నెలలో తన కంపెనీలో 35 నుంచి 75 మిలియన్ షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

TNN 25 Sep 2017, 9:45 am
ఫేస్‌‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ రానున్న 18 నెలలో తన కంపెనీలో 35 నుంచి 75 మిలియన్ షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సైన్స్ అభివృద్ధికి వాడనున్నట్లు ప్రకటించారు. దీని విలువ దాదాపు రూ. 77 వేల కోట్ల పైమాటే. రానున్న 18 నెలల్లో ఈ షేర్లను విక్రయించి ఆ మొత్తాన్ని కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు చేయనున్నట్లు తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు జుకెర్‌బర్గ్ పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి ఫేస్‌బుక్‌ను ఒక కంపెనీలా మాత్రమే స్థాపించలేదని గతంలోనే చెప్పాను. ఇదొక సోషల్ మిషన్. మా మిషన్‌ను సక్రమైన మార్గంలో నడిపేందుకు, మంచి నిర్ణయాలు తీసుకునేందుకు మాకు సహాయం చేయండి. ఫేస్‌బుక్ ఎప్పుడూ నియంత్రిత సంస్థగానే ముందుకు వెళ్తోంది. మన కమ్యూనిటీ ఉత్తమంగా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని జుకెర్‌బర్గ్ పేర్కొన్నారు.
Samayam Telugu philanthropy at work mark zuckerberg wants to sell 35 75 million facebook shares
జుకెర్‌బర్గ్ దాతృత్వం: సేవ కోసం రూ. 77వేల కోట్ల విరాళం


గడిచిన ఏడాదిన్నర కాలంగా ఫేస్‌బుక్‌ వ్యాపారం బాగా ఉందని, స్టాక్‌ విలువ కూడా మెరుగ్గా ఉందని.. అందుకే, ఛారిటీపై మరో ఇరవై ఏళ్ల దాకా మనస్ఫూర్తిగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు జుకెర్‌బర్గ్‌ పేర్కొన్నారు. దీనికి తన భార్య ప్రిస్కిల్లా నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. కాగా, జుకెర్‌బర్గ్ భార్య ప్రిస్కి్ల్లా గతంలోనూ పిల్లల వ్యాధుల నివారణ కోసం 3 బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. క్యాన్సర్, గుండెజబ్బులు, అంటు వ్యాధుల బారిన పడ్డ చిన్నారుల సహాయార్థం దాదాపు రూ.20,054 కోట్లు (3 బిలియన్ డాలర్లు) విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.