యాప్నగరం

దోషిగా తేలితే నా కొడుకునూ చంపేయండి: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె కఠిన నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అతడి కుమారుడు పాలో డ్యుటర్టె దోషని తేలితే కాల్చి చంపేయాలంటూ ఆదేశాలిచ్చారు. పాలోపై ఇటీవల ప్రతిపక్ష నేతల నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అతడు చైనా డీలర్లతో..

TNN 22 Sep 2017, 10:05 pm
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె కఠిన నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అతడి కుమారుడు పాలో డ్యుటర్టె దోషని తేలితే కాల్చి చంపేయాలంటూ ఆదేశాలిచ్చారు. పాలోపై ఇటీవల ప్రతిపక్ష నేతల నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అతడు చైనా డీలర్లతో చేతులు కలిపి అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌లోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి పాలోపై ఇప్పటికే కేసు నమోదైంది.
Samayam Telugu philippines president rodrigo orders to shoot his son if he involved in drugs
దోషిగా తేలితే నా కొడుకునూ చంపేయండి: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన ప్రకటన


తన కుమారిడిపై వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై రొడ్రిగో గురువారం (సెప్టెంబర్ 21) స్పందించారు. ‘ఒకవేళ నా కుమారుడు దోషిగా తేలితే.. అతణ్ని కూడా చంపేయండి. అప్పుడు నన్ను ఎవరూ వేలెత్తి చూపలేరు. పాలోను చంపిన పోలీసులకు రక్షణ కూడా కల్పిస్తాను’ అని రొడ్రిగో అన్నారు. డ్రగ్‌ మాఫియాలో పట్టుబడితే.. చంపేయమని ఆదేశిస్తానని తన కుమారిడికి చెప్పానని రొడ్రిగో తెలిపారు.

తమ దేశంలో పేరుకుపోయిన డ్రగ్‌ మాఫియాను అరికట్టడానికి రొడ్రిగో ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్‌ డీలర్స్‌ను కాల్చి చంపాలని ఆదేశించారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 3800 మందిని కాల్చి చంపేశారు.

ఫిలిప్పీన్స్‌లో డ్రగ్‌ మాఫియాను అరికట్టడానికే అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని ఎన్నికల సందర్భంగా చెప్పిన రొడ్రిగో.. అధికారంలోకి వచ్చిన వెంటనే కఠిన చట్టాలను తీసుకొచ్చారు. మాదక ద్రవ్యాలు వినియోగించేవారు, అక్రమంగా రవాణా చేసే వారు అరెస్టులకు తిరగబడితే కాల్చి చంపేయాలంటూ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.