యాప్నగరం

ఫ్రాన్స్ పర్యటనలో మోదీ.. INFRAకు సరికొత్త అర్థం చెప్పిన ప్రధాని

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పారిస్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరు దేశాల మైత్రిని ఆయన కొనియాడారు. గత 75 రోజుల్లోనే తమ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.

Samayam Telugu 23 Aug 2019, 4:44 pm
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు లాంటి అనేక బలమైన నిర్ణయాలు తీసుకున్నామని మోదీ తెలిపారు. తాత్కాలికమైన ఆర్టికల్ 370 రద్దుకు అనవసరంగా 70 ఏళ్లు వృథా చేశారని ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గతంలో అసాధ్యమని భావించిన అనేక లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామని ప్రధాని తెలిపారు.
Samayam Telugu modi speach


మౌళిక వసతులు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)కు ప్రధాని మోదీ సరికొత్త అర్థం చెప్పారు. భారత్ (IN), ఫ్రాన్స్ (FRA) మైత్రి IN-FRA అని మోదీ చెప్పారు. సౌరశక్తి నుంచి సమాజం వరకు, టెక్నికల్ నుంచి స్పేస్ వరకు, డిజిటల్ నుంచి డిఫెన్స్ వరకు.. భారత్, ఫ్రాన్స్ మైత్రి బలమైందన్నారు. కొన్నేళ్లలోనే గణపతి బప్పా మోరియా అని పారిస్ నినదిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

సామ్రాజ్యవాదానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా భారత్, ఫ్రాన్స్ పోరాడాయన్న మోదీ.. బలమైన సూత్రాలపై ఇరు దేశాల స్నేహం నిర్మితమైందన్నారు. భారత్, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యం గురించి ప్రధాని నొక్కి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలపై నిర్మితం అయ్యాయన్నారు.

1955, 1966 ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో చనిపోయిన వారికి ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. భారత్, ఫ్రాన్స్ అన్ని వేళలా కలిసి ఉన్నాయని, మంచి స్నేహమని ఇరు దేశాల మైత్రి నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రాన్స్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ యూఏఈ, బహ్రెయిన్‌లలో పర్యటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.