యాప్నగరం

తొలిసారి మోడీ ఆఫ్రికా పర్యటన

ప్రధానమంత్రి మోడీ తొలిసారి ఆఫ్రికా పర్యటనకు వెళ్లారు.

TNN 7 Jul 2016, 12:03 pm
ప్రధానమంత్రి మోడీ తొలిసారి ఆఫ్రికా పర్యటనకు వెళ్లారు. గురువారం ఉదయం ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ రాజధాని మొపుటో కు చేరుకున్నారు. భారత ప్రధాని 1982 తరువాత ఇక్కడ పర్యటించిన తొలిప్రధాని మోడీయే. కాగా మొపుటోలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం దక్షిణాఫ్రికా వెళతారు. జోహెన్నస్ బర్గ్, డర్బన్, ప్రిటోరియా తదితర నగరాలలో పర్యటిస్తారు. అనంతరం దక్షిణాఫ్రికా నుంచి టాంజానియా, కెన్యా దేశాల్లో పర్యటిస్తారు. ఆయా దేశాల ప్రధానులతో మోడీ సమావేశమవుతారు. ఆఫ్రికా దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడమే మోడీ పర్యటన లక్ష్యం. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆహారరంగం, తీరప్రాంత రక్షణ, హైడ్రోకార్బన్‌లు తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Samayam Telugu pm narendra modis four nation tour
తొలిసారి మోడీ ఆఫ్రికా పర్యటన


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.