యాప్నగరం

ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ శరీరాకృతిపై కంపు స్టేట్‌మెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భార్య బ్రిగెట్టి శరీరాకృతిపై..

TNN 15 Jul 2017, 4:01 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భార్య బ్రిగెట్టి శరీరాకృతిపై వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాన్స్ పర్యటనకు వచ్చిన ట్రంప్‌, ఆయన భార్య మెలానియాకు ఘన స్వాగతం పలికిన మేక్రాన్ దంపతులు వారితో కలిసి పారిస్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలుకుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. మెలనియా పక్కన నిల్చొని ఉన్న బ్రిగెట్టి శరీరం వైపు చూస్తూ.. ‘యూ ఆర్ ఇన్ సచ్ ఎ గుడ్ షేప్.. బ్యూటిఫుల్ (మీరు చక్కటి ఆకృతిలో ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు)’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. మేక్రాన్‌ వైపు తిరిగి మరోసారి అదే విషయాన్ని చెప్పాడు.
Samayam Telugu president trump says french first lady is in such good shape
ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ శరీరాకృతిపై కంపు స్టేట్‌మెంట్


‘బాస్టిల్ డే మిలిటరీ పరేడ్’ ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్.. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భానికి గుర్తుగా ఫ్రాన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ అధికారిక ఫేస్‌బుక్‌‌లో ఈ పర్యటన ఆసాంతం లైవ్‌గా కవర్ చేస్తుండటంతో ఈ దృశ్యాలను అందరూ గమనించారు.

ట్రంప్‌ అంటేనే వివాదాలకు మారు పేరుగా మారిపోయాడు. గతంలో అనేకసార్లు ఇలా మహిళలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆయన ఓ దేశాధ్యక్షుడి భార్యపైనే ఇలా కామెంట్ చేయడం మరోసారి చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.