యాప్నగరం

నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ బుధవారం రాజీనామా చేశారు.

TNN 24 May 2017, 5:17 pm
నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ బుధవారం రాజీనామా చేశారు. తొమ్మిది నెలల పాటు ప్రంచండ ప్రధానిగా కొనసాగారు. నేపాల్ లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్)-నేపాలి కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం కొనసాగుతోంది. ఇరు పార్టీల మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం ఉంది. ప్రపంచ నేపాల్ కు 39వ ప్రధానిగా 2016 ఆగస్టు 3 న ప్రమాణస్వీకారం చేశారు.
Samayam Telugu prime minister of nepal prachanda resigns
నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా


దీంతో 62ఏళ్ల ప్రచండ బుధవారం తన రాజీనామా చేశారు. ప్రపంచ ప్రధానిగా రాజీనామా చేయడం ఇది రెండోసారి. పొత్తులో భాగంగా ప్రచండ స్థానంలో నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దుబే కొనసాగుతారు. ఈయన 2018 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.

మావోయిస్టుల ప్రభావం వల్ల 1997 నుంచి నేపాల్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో అనిశ్చితి తొలగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.