యాప్నగరం

బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు అంగీకరించారు. ఆయన నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. 40 మందికిపైగా రిజైన్ చేశారు. ఈ క్రమంలో బోరిస్ తన పదవి నుంచి తప్పుకోవడం అనివార్యం అయింది. ఈ క్రమంలో బ్రిటన్‌ తర్వాత ప్రధాని ఎవరనేదానిపై చర్చ తెరపైకి వచ్చింది. అయితే భారత సంతతికి చెందిన రిషి సునక్ ఆ రేసులో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 7 Jul 2022, 5:10 pm

ప్రధానాంశాలు:

  • రాజీనామాకు అంగీకరించిన బోరిస్ జాన్సన్
  • బోరిస్ నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత
  • తర్వాత ప్రధాని ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనపై వ్యతిరేకతతో 40 మందికిపైగా రాజీనామా చేశారు. దాంతో ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్రిటన్‌కు తర్వాత పీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పీఎం పదవి రేసులో రిషి సున‌క్ ఉన్నట్టు తెలుస్తోంది. అనుకున్నట్టుగా రిషి సునక్ ప్రధాని అయితే బ్రిటన్‌కు భారతీయ సంతతికి చెందిన మొదటి ప్రధాని అవుతారు.
రిషి సునక్ భారతీయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆక్స్‌ఫర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అతను 2015 నుంచి రిచ్‌మండ్ నుంచి పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. రిషి సునక్ యూకే ఛాన్సలర్ ఆఫ్‌ ది ఎక్స్‌చెకర్‌గా కూడా పనిచేశారు. జాన్సన్ పదవీ విరమణ చేస్తే.. సునక్ ఆ పదవికి ప్రధాన పోటీదారుల్లో ఒకడు అవుతారు. బోరిస్‌ జాన్సన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థిక మంత్రి పదవికి రిషి సునక్‌ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సునక్ ట్విట్టర్‌లో "ప్రభుత్వం సక్రమంగా నిర్వహించబడుతుందని ప్రజలు ఆశించారు. ఇది నా చివరి మంత్రి పదవి అని నేను గుర్తించాను. కానీ ఈ ప్రమాణాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను, అందుకే నేను రాజీనామా చేస్తున్నాను. నా దిగువ ప్రధానమంత్రికి లేఖ." అని పేర్కొన్నారు.

సునక్ తన పదవీకాలంలో బ్రిటిష్ కమ్యూనిటీలో బాగా పాపులర్ అయ్యారు. 20220 ఫిబ్రవరి నెలలో బోరిస్ జాన్సన్ తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా సునక్ అనేక పథకాలను ప్రకటించారు. ఆ సమయంలో ఆయన పాపులర్ అయ్యారు. బ్రిటన్ ప్రజల్లో మంచి ఆదరణ కూడా పొందారు. అయితే కరోనా టైంలో కఠిన నిబంధనలు అమల్లో ఉండేటప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు రిషి సునక్‌కు జరిమానాను కూడా ఎదుర్కొన్నారు.

43 ఏళ్ల రిషి సునక్ తాతాముత్తాతలు పంజాబ్‌‌లో ఉండేవారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రూ కలసి కాలిఫోర్నియాలో చదువుకున్నారు. అప్పటి పరిచయం వారి వివాహానికి దారి తీసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.