యాప్నగరం

హోటల్‌పై ఉగ్రదాడి: భారీ ప్రాణ నష్టం

సుమారు తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడిని ఎవ్వరూ మరిచిపోలేరు. 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్‌మహల్ హోటల్‌లోకి ప్రవేశించిన సాయుధ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.

TNN 21 Jan 2018, 9:47 am
సుమారు తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడిని ఎవ్వరూ మరిచిపోలేరు. 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్‌మహల్ హోటల్‌లోకి ప్రవేశించిన సాయుధ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఆ దాడిలో సుమారు 180 మంది మృత్యువాత పడ్డారు. మళ్లీ ఇప్పుడు అలాంటి దాడే పునరావృతమైంది. కాకపోతే అది మనదేశంలో కాదు. ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగింది. కాబూల్‌లోని స్టార్ హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి దిగారు.
Samayam Telugu several dead as gunmen attack top kabul hotel
హోటల్‌పై ఉగ్రదాడి: భారీ ప్రాణ నష్టం


శనివారం రాత్రి 9 గంటల సమయంలో హోటల్‌లోకి ప్రవేశించిన సాయుధ ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. గ్రేనేడ్లతో దాడి చేశారు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఉగ్రదాడిలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. దాడిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత మంది గాయపడ్డారు వంటి విషయాలు అధికారికరంగా వెల్లడించాల్సి ఉంది. అయితే సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు కిచెన్ ద్వారా హోటల్లోకి ప్రవేశించినట్లు దాడి నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్‌ హరిస్‌ నయబ్‌ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే కాబూల్‌లోని హోటళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని యూఎస్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. యూఎస్ ఎంబసీ హెచ్చరించిన కొన్ని రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. అయితే ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో 2011లోనూ ఈ హోటల్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో 10 మంది సామాన్య ప్రజలతో సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత దాడిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.