యాప్నగరం

పాక్ మాజీ ప్రధానికి బూటు దెబ్బ

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పైకి లాహోర్‌ లో ఓ వ్యక్తి బూటు విసరాడు. బహిరంగసభకు హాజరైన షరీఫ్ పైకి బూటు విసిరాడు. బూటు నవాజ్ షరీఫ్ భుజానికి తగిలింది. 'జామియా నయామియా సెమినరీ' మాజీ విద్యార్థిగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సభకు హాజరైన నిందితుడు ఎలాగోళ ముందు వరుసకు చేరుకొని బూటు విసిరాడు.

TNN 11 Mar 2018, 4:34 pm
రాజకీయ పార్టీలకు చెందిన నేతలపై బూట్లు, చెప్పులు, కోడిగుడ్లు, ఇంకు విసరడం పరిపాటై పోయింది. భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నా నేతలను ఈకరమైన దాడుల నుంచి తప్పించ లేకపోతున్నారు. అదృష్టం బాగుండి కొంత మంది నేతలు వెంట్రుకవాసి తేడాతో తప్పించుకుంటే మరికొందరికి మాత్రం ఈ బహిరంగ ఘోర పరాభవం తప్పడం లేదు.
Samayam Telugu shoe hurled at former pakistan pm nawaz sharif
పాక్ మాజీ ప్రధానికి బూటు దెబ్బ


పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పైకి లాహోర్‌ లో ఓ వ్యక్తి బూటు విసరాడు. బహిరంగసభకు హాజరైన షరీఫ్ పైకి బూటు విసిరాడు. బూటు నవాజ్ షరీఫ్ భుజానికి తగిలింది. 'జామియా నయామియా సెమినరీ' మాజీ విద్యార్థిగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సభకు హాజరైన నిందితుడు ఎలాగోళ ముందు వరుసకు చేరుకొని బూటు విసిరాడు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నాయి. ఇవేమి పట్టించుకోని షరీఫ్ తన ఉపన్యాసాన్ని కొనసాగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజ్యాంగ నిబంధనల పేరుతో మహ్మద్ ప్రవక్త బోధించిన విషయాలను మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలకు షరీఫ్ సహకరిస్తున్నందుకే ఈ దాడి చేసినట్లు నిందితుడి వెల్లడించాడు.

ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందు పంజాబ్ ప్రావిన్సుల్లో పార్టీ కార్యకర్తలో సమావేశంలో ప్రసంగిస్తోన్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్‌ ముఖంపై ఓ వ్యక్తి సిరా విసిరాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్పరిణామానికి స్పందించిన మిగతా కార్యకర్తలు అతడిని పట్టుకుని దేహశుద్ది చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.