యాప్నగరం

Singapore Urine beer:యూరిన్‌తో బీర్... టేస్టీగా ఉందంటూ ఎగబడుతున్న మందుబాబులు

సింగపూర్‌లో ఓ కంపెనీ చాలా వెరైటీగా బీర్‌ను తయారు చేసింది. యూరిన్‌, మురికి నీటితో బీర్‌ను తయారు చేసి మార్కెట్లోకి దించింది. అయితే షాపుల్లో, బార్‌లో విక్రయిస్తోన్న ఆ బీర్‌లు చాలా టేస్టీగా ఉందని మందుబాబులు అంటున్నారు. వాటి కోసం ఎగబడుతున్నారు. ఈ బీర్‌లను స్వయంగా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం మరో విశేషం. నీటి కొరతను అధిగమించడానికి ఇలాంటి మార్గాలు అవసరమని సదరు కంపెనీ ప్రకటనలు కూడా చేసుకుంటుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 May 2022, 5:54 pm

ప్రధానాంశాలు:

  • బీర్‌లో 90 శాతం నీళ్లు
  • మురికి నీటితో బీర్‌ను తయారు చేసిన కంపెనీ
  • చాలా రుచికరంగా ఉంటుందన్న కంపెనీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Singapore Urine beer:యూరిన్‌తో బీర్... టేస్టీగా ఉందంటూ ఎగబడుతున్న మందుబాబులు
ప్రపంచవ్యాప్తంగా బీర్‌కున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు, టీ తర్వాత బీర్‌ చాలా పాపులర్. నిజానికి బీర్‌లో 90 శాతం నీరే ఉంటుంది. అందుకే బీర్ తయారీకి నీళ్లు చాలా అవసరం అవుతాయి. అయితే కొన్ని దేశాల్లో నీటి కొరత కారణంగా బీర్‌ తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సింగపూర్‌లోని కంపెనీ ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొత్త పద్ధతిలో బీర్‌లను తయారు చేసింది. అలా తయారు చేసిన ఆ బీర్‌లను మార్కెట్లోకి విడుదల కూడా చేసింది. అవి ఎంతో రుచిగా ఉండడంతో జనం కూడా ఎగబడుతున్నారు.
ఇంతకీ ఆ బీర్‌లన్నీ యూరిన్‌, మురికి నీటితో తయారు చేసినవి. (Singapore Urine beer) ఆ అందుకే వాటిని యూరిన్ బీర్, గ్రీన్ బీర్ అని ఆ కంపెనీ ప్రచారం కూడా చేస్తుంది. సింగపూర్‌లోని న్యూ బ్రూ కంపెనీ అచ్చంగా మురికి నీరు, యూరిన్‌తో తయారు చేస్తుంది. కానీ ఆ బీర్‌లు అత్యంత సురక్షితమని సందరు కంపెనీ చెబుతుంది. పలు రకాల టెస్ట్‌లు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అంతేకాదు తమ స్పెషల్ బీర్ చాలా టేస్టీగా ఉంటుందని చెబుతోంది. అలాగే ఆ బీర్‌లను తాగడానికి మందుబాబులు ఉత్సాహం చూపిస్తున్నారు.


ఈ బీర్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సింగపూర్ వాటర్ ఏజెన్సీ ఈ బీర్‌ను విడుదల చేసింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ Brewerkz ఏప్రిల్ 8న ప్రారంభించాయి. నీటి కొరత సమస్యలపై అవగాహన కల్పించడానికి న్యూబ్రూ సింగపూర్ ఈ బీర్‌ను ఆవిష్కరించినట్టు కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.