యాప్నగరం

సింగపూర్ పాస్‌పోర్ట్ పవర్‌ఫుల్, మనది?

ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల విషయంలో సింగపూర్ తొలి స్థానంలో నిలవగా.. జర్మనీ రెండో స్థానంలో ఉంది.

TNN 26 Oct 2017, 11:47 am
మన దేశంలో గుర్తింపు కోసం ఉపయోగించే ధృవపత్రాల్లో పాస్‌పోర్ట్ అత్యంత పవర్‌ఫుల్. కానీ ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారతీయ పాస్‌పోర్ట్‌కు పెద్దగా పవర్ ఫుల్ కాదని తేలింది. గ్లోబల్ ఫైనాన్సియల్ అడ్వైజరీ సంస్థ ఆర్టాన్ క్యాపిటల్ రూపొందించిన పాస్‌పోర్ ఇండెక్స్ ర్యాంకింగ్‌ల ప్రకారం మన పాస్‌పోర్ట్ 75వ స్థానంలో ఉంది. వీసా ఆన్ అరైవల్ లేదా వీసా లేకుండా ఎన్ని దేశాల్లో పర్యటించగలరు అనే అంశం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను కేటాయించారు. ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్యదేశాల పాస్‌పోర్ట్‌ల విలువను లెక్కగట్టారు.
Samayam Telugu singaporean passport is the most powerful in the world india ranked 75
సింగపూర్ పాస్‌పోర్ట్ పవర్‌ఫుల్, మనది?


పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ దేశీయులు వీసా లేకుండా 159 దేశాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఓ ఆసియా దేశం అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. జర్మనీ రెండో స్థానంలో ఉండగా.. స్వీడన్, దక్షిణ కొరియా సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, జపాన్, బ్రిటన్ దేశాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఆరోస్థానానికి పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.