యాప్నగరం

పాప్ సింగర్ మడోన్నా వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు.

TNN 23 Jan 2017, 6:54 pm
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రోజు నుంచి అతని వ్యతిరేకులు అమెరికాలోని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వారిలో పాప్ సింగర్ మడోన్నా కూడా ఒకరు. ఆమెకు కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేదు. అందుకోసం ఆమె కూడా నిరసనల్లో పాల్గొంది. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న ఆమె ట్రంప్ ను అధ్యక్షుడిగా ఒప్పుకునేది లేదని, అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్ ను పేల్చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై ఒక్కసారిగా అంతా అవాకయ్యారు. సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మడోన్నా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుంది. తన కోపాన్ని ప్రదర్శించేందుకు, తన మనసులో ఉన్న ద్వేషాన్ని చెప్పేందుకు అలాంటి పదాలు వాడాల్సి వచ్చిందని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.