యాప్నగరం

సునామీ హెచ్చరికలతో గుట్టలు ఎక్కారు..

దక్షిణ ఫసిఫిక్ మహ సముద్రంలో పఫువా న్యూ గినియా దీవులకు తూర్పు దిక్కున ఉండే సాల్మన్ దీవులు సునామీ హెచ్చరికలతో విలవిల్లాడాయి

TNN 9 Dec 2016, 9:43 am
దక్షిణ ఫసిఫిక్ మహసముద్రంలో పఫువా న్యూ గినియా దీవులకు తూర్పు దిక్కున ఉండే సాల్మన్ దీవులు సునామీ హెచ్చరికలతో విలవిల్లాడాయి. 900 దీవుల సమాహారమైన ఈ దేశాన్ని గురువారం రాత్రి సంభవించిన భూంకంపం భయపెట్టింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల ధాటికి అక్కడి ప్రజలు బెంబెలెత్తారు. దేశ రాజధాని హొనియారాకు 120 మైళ్ల దూరంలో, మక్రియా అనే దీవికి చేరువలో భూ ఉపరితలం నుంచి 30 మైళ్ల లోతున ఈ భారీ భూకంపం సంభవించింది. దీంతో ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం నుంచి సునామీ రావచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.
Samayam Telugu solomon islands earthquake people take to hills on tsunami warning
సునామీ హెచ్చరికలతో గుట్టలు ఎక్కారు..


సాధారణం కంటే ఎక్కువ ఎత్తున సముద్ర అలలు ఎగిసిపడటంతో జనాలు భయంతో బిక్కచచ్చారు. మారుమూల తీర ప్రాంతాల్లోని ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి ఎత్తయిన కొండ ప్రాంతాలకు పరుగులు తీశారు. మూడు గంటల తర్వాత సునామీ ముప్పు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకొని తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఎక్కువ లోతున భూకంపం సంభవించడంతో దాని ప్రభావం తక్కువగా కనిపించింది. ఈ భూంకంపం కారణంగా ప్రాణ నష్టం వాటిలినట్లు సమాచారమేదీ అందలేదు. 2008లో సాల్మన్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి భూకంపం కారణంగా ఐడు అడుగుల ఎత్తున సముద్ర అలలు ఎగిసి పడటంతోపాటు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.